Ind Vs Pak: పాకిస్తాన్‍ను భయపెట్టాలనుకున్నాం.. అలా చేస్తే గెలుస్తామని హార్దిక్ ముందే చెప్పాడు..

23 Oct, 2022 20:11 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్  కోహ్లి(82 నాటౌట్‌-53 బంతుల్లో 6X4, 4X6) అద్బుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌ అభిమానలు రోమాలు నిక్కొబొడిచేలా చేసింది. మ్యాచ్‌ అనంతరం 'మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ' కోహ్లి మాట్లాడాడు. 

'ఈ వాతావరణం అద్భుతంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇదంతా ఎలా జరగిందో ఐడియా లేదు.  నిజంగా మాటలు రావట్లేదు. ఇద్దరం చివరి వరకు క్రీజులో నిలబడితే విజయం సాధిస్తామని హార్దిక్ పాండ్య బలంగా నమ్మాడు. షహీన్ అఫ్రిదీ పెవిలియన్ ఎండ్‌ నుంచి బౌలింగ్‌కు రాగానే ఆ ఓవర్లో పరుగులు రాబట్టాలని డిసైడ్ అయ్యాం. హరిస్‌ రౌఫ్ వాళ్లకు ప్రధాన బౌలర్. అతని బౌలింగ్‌లో రెండు సిక్సులు బాదా. స్పిన్నర్ నవాజ్‌కు ఇంకో ఓవర్ మిగిలి ఉందని తెలుసు. అందుకే సింపుల్‌ కాల్కులేషన్‌తో హరీస్ బౌలింగ్‌లో అటాక్ చేస్తే పాక్ టీం భయపడుతుందని అనుకున్నాం.

చివర్లో 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సి ఉండగా.. రెండు సిక్సర్లతో 6 బంతుల్లో 16 పరుగులే కావాల్సి వచ్చింది. నా సహజ ప్రవృత్తిని కట్టుబడి ఆడా. ఇప్పటివరకు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచే నా కేరీర్‌లో బెస్ట్. కానీ ఈరోజు పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ అంతకంటే ఎక్కువ. హార్దిక్ నన్ను పద పదే ఎంకరేజ్ చేశాడు. క్రౌడ్ నుంచి స్పందన అద్భుతం. నా ఫ్యాన్స్ ఎప్పుడూ నాకు అండగా ఉంటున్నారు. వాళ్లకు రుణపడి ఉంటా'
- మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లీ.

160 పరుగుల లక్ష‍్య చేదనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోత కష్టాల్లో ఉన్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయపథంలో నడిపాడు కోహ్లి. చిరకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌తో క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్‌'పై తీవ్ర దుమారం

మరిన్ని వార్తలు