-

మొన్న హర్షల్‌.. ఈరోజు రసెల్‌.. మళ్లీ అదే జట్టు

13 Apr, 2021 22:01 IST|Sakshi

చెన్నై: కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చెపాక్‌ వేదికగా మంగళవారం ముంబైతో జరుగుతున్న మ్యచ్‌లో రసెల్‌ 2 ఓవర్లు మాత్రమే వేసి 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో రస్సెల్‌ తన పేరిట కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై 5 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రస్సెల్‌ నిలిచాడు. ఇంతకముందు ఆర్‌సీబీ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

కాగా గణాంకాల విషయంలో రస్సెల్‌(5/15) తొలి స్థానంలో ఉండగా.. హర్షల్‌ పటేల్‌(5/27)తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో రోహిత్‌ శర్మ(డెక్కన్‌ చార్జర్స్‌, 4/6)తో నిలిచాడు. ఇక కేకేఆర్‌ బౌలర్‌గా అత్యుత్తమ గణాంకాలతో రస్సెల్‌ తొలి స్థానంలో ఉండగా.. సునీల్‌ నరైన్‌ (5/19, వర్సెస్‌ కింగ్స్‌ పంజాబ్‌ ,2012) రెండో స్థానంలో.. వరుణ్‌ చక్రవర్తి ( 5/20, వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌, 2020) మూడో స్థానంలో ఉన్నారు. కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను బ్యాడ్‌లక్‌ వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆర్‌సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో హర్షల్‌ పటేల్‌ ఐదు వికెట్లు తీయగా.. నేడు కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రస్సెల్‌ ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించడం విశేషం. కాగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ ఆధ్యంతం నిధానంగా సాగింది. సూర్యకుమార్‌ మినహా ఎవరు దాటిగా ఆడకపోవడంతో ముంబై పెద్దగా స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: సూర్య యాక్షన్‌.. హార్దిక్‌ రియాక్షన్‌

మరిన్ని వార్తలు