ఫోన్‌ కోసం ఇంత పని చేస్తావా మ్యాక్సీ.. పాపం చహల్‌

24 Apr, 2021 16:18 IST|Sakshi
Courtesy : IPL Twitter

ముంబై: రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్‌సీబీ మంచి జోష్‌లో ఉంది. వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది.  కాగా మ్యచ్‌ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌రూమ్‌లో చహల్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ మధ్య చిన్న డిబేట్‌ నడిచింది. ఆ డిబేట్‌ సీరియస్‌ అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే బోల్డ్‌ డైరీస్‌లో భాగంగా ఆర్‌సీబీ యాజమాన్యం నిర్వహించిన ఫన్నీ షోలో వీరిద్దరు పాల్గొన్నారు. చహల్‌, మ్యాక్స్‌వెల్‌తో పాటు షాబాజ్‌ అహ్మద్‌​, డివిలియర్స్‌ కూడా ఉన్నారు. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరు ఎన్ని క్యాచ్‌లు పట్టారనేదానిపై వీరిద్దరి మధ్య డిబేట్‌ జరిగింది. అసలే ట్రోల్‌ చేయడంలో ముందు వరుసలో ఉండే చహల్‌ అవకాశం దొరికితే ఊరుకుంటాడా.. అందుకే మ్యాక్స్‌వెల్‌ను టార్గెట్‌ చేస్తూ చహల్ ఫన్నీ కామెంట్స్‌ చేశాడు.

''మ్యాచ్‌లో నేను రెండు కష్టతరమైన క్యాచ్‌లు అందుకున్నా.. మ్యాక్స్‌వెల్‌ ఒకటి మాత్రమే అందుకున్నాడు. వాస్తవానికి నేనందుకున్న రెండు క్యాచ్‌లు కష్టంగా అనిపించినా చూసేవాళ్లకు అవి సింపుల్‌గా ఉన్నాయి.. కానీ మ్యాక్సీ మాత్రం ఈజీగా అందుకోవాల్సిన క్యాచ్‌ను కావాలనే కష్టతరం చేసుకొని డైవ్‌ క్యాచ్‌గా మార్చుకున్నాడు.'' అంటూ కామెంట్‌ చేశాడు. దీనిపై షాబాజ్‌ అహ్మద్‌ స్పందిస్తూ..''కేవలం ఒక ఫోన్‌ను గిఫ్ట్‌గా పొందడానికి మ్యాక్సీ ఈ పని చేశాడు. చహల్‌ టీం కోసం ఆడుతాడు కాబట్టి.. క్యాచ్‌లు కష్టంగా అనిపించినా ఈజీగా అందుకుంటాడు.. కొందరు మాత్రం ఫోన్‌ ఆశించి ఈజీగా అందుకోవాల్సిన క్యాచ్‌లను కష్టతరం చేసుకుంటారు'' అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 178 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌ మెరుపు సెంచరీ(101 నాటౌట్‌).. కోహ్లి 72 నాటౌట్‌తో నిలిచి ఘన విజయాన్ని అందించారు. కాగా ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను రేపు(ఏప్రిల్‌ 25) సీఎస్‌కేతో ఆడనుంది.
చదవండి: టాస్‌ గెలిచి మరిచిపోయాడు.. ఏంటి కోహ్లి

'రనౌట్‌ చేశానని నా మీదకు కోపంతో రావుగా'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు