ఫ్రెంచ్‌‌ అధ్యక్షుడు: భారత్‌కు సహాయం అందించడానికి సిద్ధం

24 Apr, 2021 16:18 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న​ భారత్‌కు అన్నివిధాలా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మక్రాన్‌ అన్నారు. కరోనా కేసులు పెరిగి ఇబ్బంది పడుతున్న భారత ప్రజలకు నేను సంఘీభావ సందేశం పంపాలని అనుకుంటున్నానన్నారు. ఈ కష్టకాలంలో ఫ్రాన్స్‌ మీకు తోడుగా ఉంటుందని, ఈ మహమ్మారి ఎవరినీ విడిచిపెట్టేలా లేదని ..కనుక మనమంతా ఒకటిగా దీన్ని ఎదుర్కొని అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభిస్తూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో  మేం అన్నివిధాలా భారతదేశాని‌కి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని మక్రాన్‌ పేర్కొన్నారు. ఫ్రెంచ్‌ రాయబారి ఇమాన్యుయేల్‌ లెనైన్‌ తన అధికార ట్విట్టర్లో దేశాధినేత సందేశాన్ని పోస్టు చేశారు. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రిలో రోగులకు చికిత్స కోసం పడకలు, మెడికల్‌ ఆక్సిజన్‌ సైతం లభించడం లేదు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 3.32 లక్షల కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 2263 మంది మరణించారు.

( చదవండి: Double Masking: రెండు మాస్కులు ధరిస్తే కరోనా రాదా?

మరిన్ని వార్తలు