మా మాజీ మచ్చి.. మాపై ఎందుకు అలా‌?: సీఎస్‌కే కౌంటర్‌

4 Apr, 2021 16:18 IST|Sakshi
ఫోటో సోర్స్‌(ట్వీటర్‌)

ముంబై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కూడా ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని సీఎస్‌కే ఆఖరి స్థానంలోనే నిలుస్తుందంటూ ఆ జట్టు మాజీ ఆటగాడు, న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌  స్కాట్‌ స్టైరిస్‌ జోస్యం చెప్పాడు. కొన్ని రోజుల క్రితం ట్వీటర్‌ వేదిగా తన ఐపీఎల్‌ ప్రిడిక్షన్‌ను వెల్లడించాడు. ఇందులో ఆయా జట్ల స్థానాలను ఖరారు చేస్తూ ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా తొలి రెండు స్థానాలను ఇచ్చిన స్టైరిస్‌.. సీఎస్‌కేను ఆఖరి స్థానానికి పరిమితం చేశాడు. ఈసారి కూడా సీఎస్‌కే చివరి స్థానాన్నే సరిపెట్టుకోవాలని పేర్కొన్నాడు.  దీనిపై సీఎస్‌కే ఫ్రాంచైజీ కౌంటర్‌ ఎటాక్‌ చేస్తూనే ఉంది. తాజాగా మరొకసారి స్టైరిస్‌ జోస్యాన్ని ట్వీటర్‌లోనే రీట్వీట్‌ చేసి.. తమ మాజీ క్రికెటర్‌కు మాపై కోపం ఎందుకో అనే అర్ధం వచ్చేలా కౌంటర్‌ ఇచ్చింది. ‘ మాజీ మచ్చి.. మాపై ఎందుకు అలా’ అంటూ స్టైరిస్‌ తమతో గతంలో ఆడిన ఒక ఫోటోను ట్వీట్‌ చేసింది. 

స్టైరిస్‌ జోస్యం ప్రకారం.. డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరోసారి టైటిల్‌ నిలబెట్టుకుంటుందని.. ఆ జట్టు ఇప్పుడు అన్ని జట్లకన్నా పటిష్టంగా కనిపిస్తుందని.. అందుకే వారు ఫేవరెట్‌గా మారారని చెప్పాడు. ఇక రెండో స్థానంలో గతేడాది రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎంపిక చేశాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌కు వచ్చే మిగతా రెండు జట్లని తెలిపాడు. ఇక మరోసారి భారీ అంచనాల నడుమ  బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ ఐదో స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పాడు. కెప్టెన్‌ మారినా రాజస్తాన్‌ రాయల్స్‌ తలరాత మారదని.. అయితే వేలంలో కోట్లు పెట్టి కొన్న క్రిస్‌ మోరిస్‌తో పాటు జోఫ్రా ఆర్చర్‌లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని.. అయినా ఆ జట్టు ఆరవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఏడో స్థానంలో కేకేఆర్‌, ఎనిమిదో స్థానంలో సీఎస్‌కేలు ఉంటాయన్నాడు.

ఇక్కడ చదవండి: ఆ క్యాచ్‌పై తీవ్ర చర్చ.. మీరు కూడా ఓ లుక్కేయండి

వన్డే క్రికెట్‌లో నయా వరల్డ్‌ రికార్డు

మరిన్ని వార్తలు