అక్కడికి ఒంటరిగానే వెళ్తానంటున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ

4 Apr, 2021 16:24 IST|Sakshi

యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది ఆరియానా గ్లోరీ. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అదిరిపోయే ఆటతో పాటు తన దూకూడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీగా మారిపోయింది. తాజాగా ఈ భామ కొన్ని రోజులు మీకు కనిపించను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది.

నేను అక్కడికి ఒంటరిగానే వెళ్తున్న

తాజాగా ఆరియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్‌ చేసింది. అందులో ‘నేను రెండు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే తెగ ట్యాగ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను, ఈ నెల 12వ తేదీ వరకు నేను కనిపించను. హిమాలయాలకు ట్రెక్కింగ్ కోసం ఒంటరిగానే వెళ్తున్నాను. ఒంటరిగా అంటే అక్కడ ట్రెక్కింగ్ గ్యాంగ్ ఉంటుంది. ఆ ప్రాంతంలో సిగ్నల్స్ కూడా ఉండదు కాబట్టి కొన్న రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండలేను. కనుక నన్నుఅర్థం చేసుకోండి. వచ్చాక అన్ని విషయాలను చెబుతానని అరియానా తెలిపింది. ఆ తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయిన ఫొటోను షేర్ చేసింది.

ఈ అమ్మడు రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో కనిపించకపోతే, తెగ బాధ పడిపోతున్నారు ఆమె అభిమానులు. ఇటీవల అనారోగ్యానికి గురైన సమయంలోనూ ఇదే జరిగింది. ఈ కారణంగానే తాజాగా తన ఫాలోవర్లకు ఈ వీడియో పోస్ట్‌ చెసిందీ బోల్డ్ బ్యూటీ.
( చదవండి:  వర్షపై బాడీషేమింగ్‌ చేసిన హైపర్‌ ఆది )

మరిన్ని వార్తలు