ఐపీఎల్‌ 2021: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘనవిజయం

9 Apr, 2021 23:31 IST|Sakshi

►చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘనవిజయం సాధించింది. ఏబీ డివిలియర్స్‌(48) తన అసాధారణ ఆటతీరుతో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ను ముందుండి నడిపించినా.. కీలక సమయంలో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి రెండు బంతుల్లో 2 పరుగులు చేసి ఆర్‌సీబీ విజయం సాధించింది.

►158 పరుగుల వద్ద ఆర్‌సీబీ బ్యాట్‌మన్‌ డివిలియర్స్‌ రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు.

6వ వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ
►లక్ష్య చేధనలో ఆర్‌సీబీ మరో వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా వేసిన 17వ ఓవర్‌ మూడో బంతికి ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ డానియల్‌ క్రిస్టియన్‌ రాహుల్‌ చాహర్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ
►106 పరుగుల వద్ద ఆర్‌సీబీ ఐదో వికెట్‌ను కోల్పోయింది. మ్యాక్రో జన్సేన్‌ వేసిన 15వ ఓవర్‌ చివరి బంతికి షాబాజ్‌ అహ్మద్‌ 5వ వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం డానియల్‌ క్రిస్టియన్ 0‌, డివిలియర్స్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

103 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్‌ ఔట్
► 160 పరుగుల లక్ష్య చేధనలో 103 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. మ్యాక్రో జన్సేన్‌ వేసిన 15 వ ఓవర్‌ మొదటి బంతికి క్రిస్‌ లిన్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు మ్యాక్స్‌వెల్‌ నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.

కోహ్లి ఔట్‌.. ఆర్‌సీబీ 98/3
► ఆర్‌సీబీ 98 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 2వ ఓవర్‌ మూడో బంతికి కోహ్లి క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజులో మ్యాక్స్‌వెల్‌ 37, డివిలియర్స్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ
► 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 46 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్ ఐదో బంతికి 8 పరుగులు చేసిన పాటిదార్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.అంతకముందు‌ 36 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన వాషింగ్టన్‌ సుందర్‌ కృనాల్‌ బౌలింగ్‌లో క్రిస్‌ లిన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

►చెపాక్‌ వేదికగా ఆర్‌సీబీతో జరుగుతున్న తొలి లీగ్‌ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.  ముంబై ఇండియన్స్ తొలి ఇన్నిం ఆర్‌సీబీకి 160 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ 49 పరుగులతో రాణించగా.. మిగతావారు విఫలం కావడంతో ముంబై సాధారణ స్కోరుకు పరిమితమైంది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ ఐదు వికెట్లతో రాణించగా.. కైల్‌ జేమిసన్‌ 1, సుందర్‌ ఒక వికెట్‌ తీశాడు.‌  

హార్దిక్‌ పాండ్యా ఔట్‌.. నాలుగో వికెట్‌ డౌన్‌
►ముంబై ఇండియన్స్‌ 135 పరుగుల వద్ద హార్దిక్‌ పాండ్యా రూపంలో నాలుగో వికెట్‌ కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ వేసిన బంతి హర్దిక్‌ ప్యాడ్లను ఆఫ్‌సైడ్ స్టంప్‌ దిశగా వెళ్లింది. దీంతో ఆర్‌సీబీ అంపైర్‌కు అప్పీల్‌ చేయగా.. ఔట్‌ ఇచ్చాడు. హర్ధిక్‌ రివ్యూ కోరగా.. రిప్లేలో ఔట్‌ అని తేలింది. ‌

ముంబై మూడో వికెట్‌ డౌన్‌, క్రిస్‌ లిన్(49) ఔట్‌‌ ‌‌
►హాఫ్‌ సెంచరీకి చేరువగా వెళ్లిన క్రిస్‌ లిన్‌(35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై స్కోర్‌ 105/3. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌(6 బంతుల్లో 4), హార్ధిక్‌ పాండ్యా(0) ఉన్నారు. బెంగళూరు బౌలర్లలో జేమీసన్‌, సుందర్‌లకు తలో వికెట్‌ దక్కింది. 

రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై, సూర్యకుమార్‌(31) ఔట్‌‌
►దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్‌(23 బంతుల్లో 31; 4 ఫోర్లు, సిక్స్‌)ను కైల్‌ జేమీసన్‌ బోల్తా కొట్టించాడు. సిక్సర్‌ బాది ఊపు మీద కనిపించిన సూర్యకుమార్‌.. అనవసర షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ కీపర్‌ డివిల్లియర్స్‌ చేతికి క్యాచ్‌ అందించి పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 11 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 94/1. క్రీజ్‌లో లిన్‌(29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌(0) ఉన్నారు.

9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 83/1
►ఆదిలోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ను కోల్పోయిన ముంబై ఇండియన్స్‌, ఆతరువాత నిలకడగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించింది. క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్(15 బంతుల్లో 22; 4 ఫోర్లు)‌ తనదైన స్టైల్‌లో దూకుడుగా ఆడుతూ అలరిస్తున్నాడు. అతనికి ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌(25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తిగా సహకరిస్తున్నాడు. దీంతో  9 ఓవర్ల విరామం సమయానికి స్కోర్‌ 83/1.

రోహిత్‌ రనౌట్‌
►ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. చహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ చివరి బంతిని క్రిస్‌ లిన్‌ ఫ్లిక్‌ చేయగా.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న రోహిత్‌ క్రీజు దాటి ముందుకు వచ్చేశాడు. అయితే గల్లీలో చురుగ్గా ఉన్న కోహ్లి బంతిని చహల్‌కు త్రో వేయగా.. అతను క్షణం ఆలస్యం చేయకుండా వికెట్లను గిరాటేయడంతో రోహిత్‌ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ముంబై 24 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

నెమ్మదిగా ముంబై ఇ‍న్నింగ్స్‌ ఆరంభం
►ముంబై ఇండియన్స్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, క్రిస్‌ లిన్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా ఆరంభించారు. ఆర్‌సీబీ నుంచి ఓపెనింగ్‌ బౌలర్‌గా వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ తొలి ఓవర్‌లో 5 పరుగులు ఇవ్వగా.. ఆ తర్వాతి ఓవర్లో కైల్‌ జేమిసన్‌ ఒక పరుగు ఇవ్వడంతో ముంబై రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్ట పోకుండా 6 పరుగులు చేసింది.  

చెన్నై: యావత్‌ క్రీడా ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ సీజన్‌ రానే వచ్చింది. కరోనా నేపథ్యంలో గతేడాది దుబాయ్‌కి తరలిపోయిన ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌.. ఈ ఏడాది భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఘనంగా ప్రారంభమయింది.టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ  ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగిన ఫేస్‌ టు ఫేస్‌ ఫైట్‌ వివరాలను ఓసారి పరిశీలిద్దాం. ఇప్పటివరకు రెండు జట్లు 27 సందర్భాల్లో ఎదురుపడగా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైదే పైచేయిగా నిలిచింది. నెక్‌ టు నెక్‌ ఫైట్‌లో ముంబై 17సార్లు గెలుపొందగా, ఆర్‌సీబీ 9 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఒక మ్యాచ్‌ టై(2020) కాగా, సూపర్‌ ఓవర్‌ ద్వారా ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. దీంతో ఆర్‌సీబీ విజయాల సంఖ్య 10కి చేరింది. టైటిల్‌ల పరంగా చూస్తే ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు 5 సార్లు విజేతగా నిలువగా, బెంగళూరు జట్టు బోణీ కూడా కొట్టలేకపోయింది.

తుది జట్లు: 
ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), క్రిస్‌ లిన్‌, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, మార్కో జాన్సెన్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా,  రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లి (కెప్టెన్), రజత్‌ పాటిదార్‌, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీషన్, చాహల్, మహ్మద్ సిరాజ్, షాబాజ్‌ అహ్మద్‌

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు