IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్‌ లేదంటే కేకేఆర్‌

6 Oct, 2021 11:06 IST|Sakshi

IPL 2021 Playoff Race.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌ లీగ్‌ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే, ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌ చేరుకోగా.. మిగిలిఉన్న ఒక్కస్థానానికి ఎవరు క్వాలిఫై అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు కేకేఆర్‌తో పాటు ముంబై ఇండియన్స్‌కు ఉంది.  పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు లేనప్పటికి అదృష్టంతో  వెళ్లే చాన్స్‌ ఉంటుంది. కానీ ఆ అవకాశం ముంబై, కేకేఆర్‌లు ఇవ్వకపోవచ్చు. 

కేకేఆర్‌:


Courtesy: IPL Twitter

కేకేఆర్‌ ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లతో  నాలుగో స్థానంలో ఉంది. కేకేఆర్‌ నెట్‌రన్‌రేట్‌ +0.294గా ఉంది. ఇక ఆ జట్టు తన చివరి మ్యాచ్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడుతోంది. ఈ మ్యాచ్‌ను కేకేఆర్‌ గెలిస్తే చాలు. 14 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ రాజస్తాన్‌తో ఓడినప్పటికి కేకేఆర్‌కు మరో అవకాశం ఉంది. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తప్పకుండా ఓడిపోవాలి. అలా కాకుండా ముంబై గెలిస్తే కేకేఆర్‌ అవకాశం కోల్పోయినట్లవుతుంది. ఇటు రాజస్తాన్‌ చేతిలో కేకేఆర్‌.. అటు ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ముంబై ఓడితే మాత్రం నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

చదవండి: MS Dhoni: సాక్షి సింగ్‌ సమక్షంలోనే ధోనికి లవ్‌ ప్రపోజ్‌

ముంబై ఇండియన్స్‌:


Courtesy: IPL Twitter
రాజస్తాన్‌ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బారీ తేడాతో గెలిచి ఒక్కసారిగా ప్లే ఆఫ్స్‌ రేసులోకి వచ్చింది. 13 మ్యాచ్‌లాడిన ముంబై 6 విజయాలు.. 7 ఓటములతో ఐదో స్థానంలో ఉంది. ముంబై నెట్‌రన్‌రేట్‌ -0.048గా ఉంది. ముంబై ఇండియన్స్‌ తన చివరి మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై  120 పరుగులకంటే ఎక్కువ బారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ముంబై ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు అంతంత మాత్రమే. అది వీలు కాని పక్షంలో రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి.  

పంజాబ్‌ కింగ్స్‌: 


Courtesy: IPL Twitter
ఇప్పటికైతే పంజాబ్‌ కింగ్స్‌కు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు లేనట్లే. పంజాబ్‌ 13 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. 8 ఓటములతో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పంజాబ్‌ తన చివరి మ్యాచ్‌ను సీఎస్‌కేతో ఆడనుంది. సీఎస్‌కేపై గెలిస్తే పంజాబ్‌ ఖాతాలో 12 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో కేకేఆర్‌ రాజస్తాన్‌ చేతిలో.. ముంబై ఇండియన్స్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో బారీ తేడాతో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం సీఎస్‌కే లాంటి పటిష్టమైన జట్టును పంజాబ్‌ ఓడించడం అసాధ్యం. కానీ టి20 అంటేనే సంచలనాలకు వేదిక. మరి పంజాబ్‌ అదృష్టం ఏ విధంగా ఉంటుందో చూద్దాం.

చదవండి: IPL 2021: ధోని భయ్యా.. నాకు బర్త్‌డే గిఫ్ట్‌ ఏం లేదా

రాజస్తాన్‌ రాయల్స్‌:


Courtesy: IPL Twitter 
పంజాబ్‌ కింగ్స్‌ విషయంలో ఏదైతే జరగాలో అదే రాజస్తాన్‌ రాయల్స్‌కు వర్తిస్తుంది. అయితే కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్‌ బారీ తేడాతో గెలవడమే గాక.. ఎస్‌ఆర్‌హెచ్‌ ముంబై ఇండియన్స్‌ను బారీ తేడాతో చిత్తు చేయాలి. అప్పుడు కూడా రాజస్తాన్‌ ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశాలు అంతంత మాత్రమే. ముంబై ఇండియన్స్‌ చేతిలో దారుణ పరాజయం రాజస్తాన్‌ అవకాశాలపై బారీ గండి పడింది. 13 మ్యాచ్‌లాడిన రాజస్తాన్‌ 5 విజయాలు.. 8 ఓటములతో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. రాజస్తాన్‌ నెట్‌రన్‌రేట్‌ -0.737గా ఉంది.

చదవండి: Ishan Kishan: రికార్డుతో పాటు ఫామ్‌లోకి వచ్చాడు.. సంతోషం

మరిన్ని వార్తలు