ఎంపీ ఎంవీవీ ఉదారత.. పేద విద్యార్థి చదువుకు రూ.2 లక్షల సాయం

6 Oct, 2021 11:00 IST|Sakshi
శ్రీకాంత్‌కు చెక్కు అందజేస్తున్న ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ

సాక్షి, దొండపర్తి(విశాఖ దక్షిణ): పేద విద్యార్థి ఉన్నత చదువు కోసం రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసి ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ తన గొప్ప మనసును చాటుకున్నారు. చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నిర్వహించిన బీటెక్‌(ఈసీఈ) ప్రవేశ పరీక్షలో నగరానికి చెందిన జి.శ్రీకాంత్‌ మెరిట్‌లో అడ్మిషన్‌ సాధించాడు. ప్రవేశానికి రూ.3 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంది. జర్నలిస్టుగా ఉన్న తన తండ్రికి అంత స్తోమత లేకపోవడంతో శ్రీకాంత్‌ యూనివర్సిటీలో చేరలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ఎంవీవీ రూ.2 లక్షలు సాయం చేశారు.

అంతేకాకుండా యూనివర్సిటీ వీసీతోపాటు పెరంబదూర్‌ ఎంపీతో మాట్లాడి ఫీజులో రూ. లక్ష రాయితీ ఇప్పించి శ్రీకాంత్‌ బీటెక్‌ చదువుకు మార్గం సుగమం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.    

మరిన్ని వార్తలు