పోరాడి ఓడిన రాజస్థాన్‌.. ఊపిరి పీల్చుకున్న పంజాబ్‌

12 Apr, 2021 19:07 IST|Sakshi
ఫోటో కర్టసీ: ఐపీఎల్‌ వెబ్‌సైట్‌

హోరాహోరీ పోరులో పంజాబ్‌ కింగ్స్‌ గెలిచి ఊపిరి పీల్చుకోగా.  రాజస్థాన్‌ పోరాడి ఓడింది. ఇరుజట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 4 పరుగులు తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 222 పరుగుల టార్గెట్‌లో రాయల్స్‌ 217 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. సంజూ సాంసన్‌ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. 63 బంతుల్లో 119 పరుగులు సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 221 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌(50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించి పంజాబ్‌ భారీ స్కోరు చేయడంలో సహకరించాడు.

సంజూ సాంసన్‌ సెంచరీ
రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సాంసన్‌ సెంచరీ సాధించాడు. 54 బంతుల్లో సెంచరీ సాధించి తన పవర్‌ ఏమిటో నిరూపించుకున్నాడు. కెప్టెన్‌గా చేసిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాదించడం విశేషం. 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో శతకం సాధించాడు.

పరాగ్‌(25) ఔట్‌, రాజస్థాన్‌ 175/5
రియాన్‌ పరాగ్‌(25) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. షమీ వేసిన 17 ఓవర్‌ రెండో బంతికి పరాగ్‌ ఔటయ్యాడు. షమీ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతిని షాట్‌ ఆడబోయి వికెట్‌ కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో 175 పరుగుల వద్ద రాజస్థాన్‌ ఐదో వికెట్‌ను కోల్పోయింది.

15 ఓవర్లలో రాజస్థాన్‌ 155/4
రాజస్థాన్‌ రాయల్స్‌ 15 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సంజూ సాంసన్‌ 76 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా రియాన్‌ పరాగ్‌ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. సాంసన్‌ ఫోర్లు, సిక్స్‌లతో దుమ్మురేపుతున్నాడు.

దూబే(23) ఔట్‌, రాజస్థాన్‌ 123/4
నాల్గో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌, దూబే(23) నాల్గో వికెట్‌గా ఔట్‌. అర్షదీప్‌ వేసిన 13 ఓవర్‌ నాల్గో బంతికి భారీ షాట్‌కు యత్నించిన దూబే. బౌండరీ లైన్‌ వద్ద దీపక్‌ హుడా అద్భుతమైన క్యాచ్‌తో దూబే పెవిలియన్‌కు. రాజస్థాన్‌ 123 పరుగులు వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది.

సంజూ సాంసన్‌ హాఫ్‌ సెంచరీ
రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ హాఫ్‌ సెంచరీ. 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో అర్థ శతకం. ఫోర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ.

10 ఓవర్లలో రాజస్థాన్‌ 95/3
10 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్‌ రాయల్స్‌ 95 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ 41 పరుగులు, శివం దూబే 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. జోస్‌ బట్లర్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, అంతకుముందు బెన్‌ స్టోక్స్‌(0), మనన్‌ వోహ్రా(12)లు నిరాశపరిచారు.

బట్లర్‌(25) క్లీన్‌ బౌల్డ్‌, రాజస్థాన్‌ 70/3‌‌‌‌
రిచర్డ్‌సన్‌ వేసిన స్లో బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన జోస్‌ బట్లర్‌(13 బంతుల్లో 25) క్లీన్‌ బౌల్డ్‌య్యాడు. దీంతో 7.3 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ సాంసన్‌(22 బంతుల్లో 29; 6 ఫోర్లు)కు జతగా శివమ్‌ దూబే(0)‌ క్రీజ్లోకి వచ్చాడు.

రాజస్థాన్‌ సెకెండ్‌ వికెట్‌ డౌన్‌, వోహ్రా(12) ఔట్‌
పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుతమైన రిటర్న్‌ క్యాచ్‌ అందుకోవడంతో మనన్‌ వోహ్రా(8 బంతుల్లో 12; ఫోర్‌, సిక్స్‌) పెవిలియన్‌ బాట పట్టాడు. 3.2 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 25/2. కెప్టెన్‌ సంజూ సాంసన్‌(9 బంతుల్లో 12; 3 ఫోర్లు)కు తోడుగా జోస్‌ బట్లర్‌ క్రీజ్లోకి వచ్చాడు.

రాజస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌, స్టోక్స్‌ డకౌట్
మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రాహుల్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో ఇన్నింగ్స్‌ మూడో బంతికే డేంజరస్‌ బెన్‌ స్టోక్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఖాతా తెరవకుండానే రాజస్థాన్‌ వికెట్‌ కోల్పోయింది. క్రీజ్‌లో సంజూ సాంసన్‌(0), మనన్‌ వోహ్రా(0) ఉన్నారు.

పంజాబ్‌ భారీ స్కోర్‌, రాజస్థాన్‌ టార్గెట్‌ 222‌‌
ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌.. కేవలం 5 పరుగులు మాత్రమే జోడించి ప్రత్యర్ధి ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సకారియా వేసిన ఈ ఓవర్లో రెండో బంతికి రాహుల్‌, ఆఖరి బంతికి రిచర్డ్‌సన్‌(0) అవుటవ్వడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ 6 వికెట్లు కోల్పోయి 221 పరుగులు సాధించింది. కొత్త కుర్రాడు షారుక్‌ ఖాన్‌(4 బంతుల్లో 6; ఫోర్‌) నాటౌట్‌గా నిలిచాడు. అరంగేట్రం కుర్రాడు సకారియా 3 వికెట్లు, క్రిస్‌ మోరిస్‌ 2, రియాన్‌ పరాగ్‌కు ఓ వికెట్‌ దక్కింది. 

తెవాతియా అద్భుతం.. సెంచరీ చేజార్చుకున​ రాహుల్‌
డీప్‌ మిడ్‌ వికెట్‌లో తెవాతియా అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో కేఎల్‌ రాహుల్‌(50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. కొత్త కుర్రాడు సకారియాకు రాహుల్‌ వికెట్ దక్కింది. 19.2 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 220/5. ‌

చేతన్‌ సకారియా అద్భుత క్యాచ్‌.. పూరన్‌ డకౌట్
మోరిస్‌ బౌలింగ్‌లో కొత్త కుర్రాడు చేతన్‌ సకారియా అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో నికోలస్‌ పూరన్‌(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో18 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 201/4. క్రీజ్‌లో రాహుల్‌(79), షారుక్‌ ఖాన్‌(0) ఉన్నారు.

హూడా(64) ఆరేసి అవుటయ్యాడు..
రాజస్థాన్‌ బౌలర్లను సిక్సర్ల సునామీలో ముంచేసిన దీపక్‌ హూడా(28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ఎట్టకేలకు అవుటయ్యాడు. మోరిస్‌ వేసిన 18వ ఓవర్‌లో లాంగ్‌ ఆన్‌లో ఉన్న రియాన్‌ పరాగ్‌ సింపుల్‌ క్యాచ్‌ అందుకోవడంతో హూడా పెవిలియన్‌ బాట పట్టాడు. మరో పక్క రాహుల్‌(43 బంతుల్లో 79; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సైతం జోరు ప్రదర్శిస్తుండటంతో 17.5 ఓవర్లలో పంజాబ్‌ స్కోర్‌ 201/3. క్రీజ్‌లోకి పూరన్‌ వచ్చాడు.

హూడా సిక్సర్ల సునామీ.. 20 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి
దూబే వేసిన 13 ఓవర్‌లో రెండు సిక్సర్లు, శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 14వ ఓవర్‌లో 3 భారీ సిక్సర్లు బాదిన దీపక్‌ హూడా(20 బంతుల్లో 50; ఫోర్‌, 6 సిక్సర్లు), మోరిస్‌ వేసిన 16వ ఓవర్‌లో కూడా భారీ సిక్సర్‌ బాది మెరుపు వేగంతో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ రాహుల్‌(36 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం జోరుమీదుండటంతో 15.3 ఓవర్లలో పంజాబ్‌ స్కోర్‌ 170/2.

సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రాహుల్
శివమ్‌ దూబే వేసిన 13వ ఓవర్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సిక్సర్‌(31 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌లో దీపక్‌ హూడా(10 బంతుల్లో 20; ఫోర్‌, 2 సిక్సర్లు) సైతం మరో రెండు సిక్సర్లతో రెచ్చిపోవడంతో 13 ఓవర్ల తర్వాత పంజాబ్‌ 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.   

డేంజర్‌ మ్యాన్‌ క్రిస్‌ గేల్‌(40) ఔట్
స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగిన  విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ను(28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు‌) రియాన్‌ పరాగ్‌ పెవిలియన్‌కు పంపాడు. తెవాతియా వేసిన అంతకుముందు ఓవర్‌లో భారీ సిక్సర్‌ బాది ఊపుమీదున్నట్టు కనిపించిన గేల్‌, మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో లాంగ్‌ ఆన్‌లో ఉన్న బెన్‌ స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. క్రీజ్‌లో కెప్టెన్‌ రాహుల్‌(22 బంతుల్లో 32; 5 ఫోర్లు), దీపక్‌ హూడా(0) ఉన్నారు. 10 ఓవర్లు ముగిసాక పంజాబ్‌ స్కోర్‌ 89/2.

గేర్‌ మార్చిన పంజాబ్‌, 9 ఓవర్ల తర్వాత 82/1
ఓపెనర్‌ మయాంక్‌ వికెట్‌ కోల్పోయాక ఆచితూచి ఆడిన పంజాబ్‌.. 7 ఓవర్‌ తరువాత గేర్‌ మార్చింది. హార్డ్‌ హిట్టర్‌ గేల్‌(26 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు‌), కెప్టెన్‌ రాహుల్‌(19 బంతుల్లో 26; 4 ఫోర్లు)లు లూస్‌ బంతులను పనిష్‌ చేస్తూ.. ఫోర్లు, సిక్సర్లు బాదుతున్నారు. 9 ఓవర్లు ముగిసాక పంజాబ్‌ స్కోర్‌ 82/1.

పంజాబ్‌ తొలి వికెట్‌ డౌన్‌, మయాంక్‌(14) ఔట్‌‌
దూకుడుగా ఆడుతున్న పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను(9 బంతుల్లో 14; 2 ఫోర్లు) రాజస్థాన్‌ రాయల్స్‌ అరంగేట్రం బౌలర్‌ చేతన్ సకారియా బోల్తా కొట్టించాడు. 2.4వ ఓవర్‌లో బంతి స్లైట్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో వికెట్‌ కీపర్‌ సంజు సాంసన్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. 3 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 22/1. కెప్టెన్‌ రాహుల్‌కు(7 బంతుల్లో 7; ఫోర్‌) తోడుగా క్రిస్‌ గేల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

ముంబై:  పంజాబ్‌ కింగ్స్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న సీజన్‌ నాలుగవ మ్యాచ్‌లో రాజస్థాన్‌‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ సాంసన్‌‌ ప్రత్యర్థి జట్టును ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటిరకూ ఇరు జట్లు 21 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా, రాజస్తాన్‌ 12 సార్లు, పంజాబ్‌ 9 సార్లు గెలుపొందాయి. గత సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్‌నే విజయం వరించింది. 2020 సీజన్‌లో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 224 పరుగుల టార్గెట్‌ను ఛేదించి మరీ పంజాబ్‌పై గెలుపొందింది. స్టీవ్‌ స్మిత్‌, సంజూ శాంసన్‌, రాహుల్‌ తెవాటియాలు రాణించడంతో రాయల్స్‌ ముందు భారీ లక్ష్యం సైతం చిన్నబోయింది. 

ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ చేసిన సెంచరీ వృథా అయ్యింది. అబుదాబిలో ఇరుజట్ల మధ్య జరిగిన రెండో లీగ్‌లో రాజస్తాన్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను రాజస్థాన్‌ 17.3 ఓవర్లలో ఛేదించింది. ఆ మ్యాచ్‌లో బెన్‌ స్టోక్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  26 బంతుల్లో 50 పరుగులు చేయడమే కాకుండా, రెండు వికెట్లు సాధించాడు. కాగా, ఇరుజట్ల మధ్య గత ఐదు మ్యాచ్‌ల్లో కూడా రాజస్తాన్‌దే పైచేయిగా ఉంది. మూడు మ్యాచ్‌లో రాజస్తాన్‌ విజయం సాధించగా,  పంజాబ్‌ రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.

జట్ల వివరాలు:
రాజస్తాన్‌ రాయల్స్‌: జోస్‌ బట్లర్‌, మనన్‌ వొహ్రా, బెన్‌ స్టోక్స్‌, సంజూ సాంసన్(కెప్టెన్‌)‌, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబే, రాహుల్‌ తెవాతియా, క్రిస్‌ మోరిస్‌, శేయస్‌ గోపాల్‌, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

పంజాబ్‌ కింగ్స్‌: కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌)‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, నికోలాస్‌ పూరన్‌, దీపక్‌ హూడా, షారుఖ్‌ ఖాన్‌, జైన్‌ రిచర్డ్‌సన్‌, మురుగన్‌ అశ్విన్‌, మెరిడిత్‌, షమీ, అర్షదీప్‌ సింగ్‌

మరిన్ని వార్తలు