సిక్సర్లలో 7వ స్థానం.. అరుదైన రికార్డు

25 Apr, 2021 17:02 IST|Sakshi
Courtesy: IPL Twitter

ముంబై: సీఎస్‌కే బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 200 సిక్సర్లు కొట్టిన 7వ ఆటగాడిగా రైనా నిలిచాడు. ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో చహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ చివరి బంతిని లాంగాన్‌ మీదుగా సిక్సర్‌గా మలిచిన రైనా ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సిక్సర్లు బాదిన రైనా మొత్తంగా 24 పరుగులు సాధించాడు.

కాగా రైనా కంటే ముందు గేల్‌ 354 సిక్సర్లతో టాప్‌లో ఉండగా.. ఏబీ డివిలియర్స్‌(240) రోహిత్‌ శర్మ(222), ఎంఎస్ ధోని(217), కోహ్లి(204), పొలార్డ్‌(202) తొలి ఆరు స్థానాల్లో నిలిచారు. ఇక ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జడేజా 11, రాయుడు 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు డుప్లెసిస్‌ 50 పరుగులతో ఆకట్టుకున్నాడు.

మరిన్ని వార్తలు