IPL 2022 GT Vs PBKS: 'కొంచెం జాగ్రత్తగా ఉంటే వేరుగా ఉండేది.. తప్పు చేశావ్‌'

8 Apr, 2022 21:18 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 గుజరాత్‌ టైటాన్స్‌కు తొలి సీజన్‌. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని ఈ జట్టు తన ప్రదర్శనతో బాగానే ఆకట్టుకుంటుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి విజయాలు సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌ పంజాబ్‌ కింగ్స్‌తో తలపడుతుంది. కాగా మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే లివింగ్‌స్టోన్‌ 14 పరుగుల వద్దే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ రషీద్‌ ఖాన్‌  వేయగా.. ఓవర్‌ నాలుగో బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. బౌండరీకి కొద్ది దూరంలో ఉన్న హార్దిక్‌ పరిగెత్తుకొచ్చి అద్బుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. అప్పటికే బౌండరీ లైన్‌కు చేరువగా రావడంతో బంతిని గాల్లోకి విసిరాడు. అయితే మళ్లీ అందుకునే లోపే బౌండరీలైన్‌ను తాకాడు. అయితే హార్దిక్‌ మాత్రం లివింగ్‌స్టోన్‌  ఔటయ్యాడని సంబరాలు చేసుకున్నాడు. కానీ ఔట్‌ విషయమై అంపైర్‌ థర్డ్‌అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. రిప్లేలో హార్దిక్‌ రెండోసారి క్యాచ్‌ అందుకునే సమయంలో బౌండరీ లైన్‌ తాకినట్లు కనిపించింది.

దీంతో అంపైర్‌ సిక్స్‌ ప్రకటించాడు. అలా 15 పరుగుల వద్ద బతికిపోయిన లివింగ్‌స్టోన్‌ ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత అతను ఆడిన 18 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాను అభిమానులు ట్రోల్‌ చేశారు. ''ఎంత పని జరిగే.. కాస్త జాగ్రత్తగా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.. తప్పు చేశావ్‌ హార్దిక్‌ పాండ్యా'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: Mayank Agarwal: 'బాబుపై కెప్టెన్సీ ప్రభావం గట్టిగా ఉంది.. తొలగిస్తే ఆడతాడేమో!'

మరిన్ని వార్తలు