Umesh Yadav: పూర్వ వైభవం సాధించే పనిలో క్రికెటర్‌.. ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌

1 Apr, 2022 20:05 IST|Sakshi
Courtesy: IPL Twitter

కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు. పవర్‌ ప్లేలో 50 వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా ఉమేశ్‌ యాదవ్‌ నిలిచాడు. ఐపీఎల్‌ 2022లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే మయాంక్‌ను ఎల్బీ చేయడం ద్వారా ఉమేశ్‌ ఈ ఘనత అందుకున్నాడు. కాగా ఉమేశ్‌ యాదవ్‌ కంటే ముందు జహీర్‌ ఖాన్‌(52 వికెట్లు), సందీప్‌ శర్మ(52 వికెట్లు), భువనేశ్వర్‌ కుమార్‌(51 వికెట్లు) వరుసగా మూడు స్థానాల్లో ఉన్నారు.

కాగా టీమిండియా తరపున టి20లు, వన్డేలకు దూరమైన ఉమేశ్‌ కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఒక రకంగా ఐపీఎల్‌లో అతని ఎంట్రీ సూపర్‌ అనే చెప్పొచ్చు. 2019 నుంచి ఉమేశ్‌ యాదవ్‌ అంతర్జాతీయంగా ఒక్క టి20 మ్యాచ్‌ ఆడలేదు. ఐపీఎల్‌ 2022 ఆరంభానికి ముందు జరిగిన మెగావేలంలో ఉమేశ్‌ను కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. తొలి రెండు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిన ఉమేశ్‌ యాదవ్‌.. మూడో రౌండ్‌లో కేకేఆర్‌ కేకేఆర్‌ కొనుగోలు చేసింది. మొత్తానికి ఉమేశ్‌ యాదవ్‌ మరోసారి మంచి ఫామ్‌ కనబరుస్తున్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రానున్న ఆర్నెళ్లలో జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2022కు టీమిండియాకు ఎంపికైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉమేశ్‌ పూర్వ వైభవం అందుకునే పనిలో ఉన్నాడు.. అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తు‍న్నారు.

చదవండి: IPL 2022: జడ్డూ చేతులెత్తేశాడా.. అందుకే ధోని రంగంలోకి ?

మరిన్ని వార్తలు