ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్లోరాజస్తాన్ ఓడినప్పటికి చహల్ మాత్రం ఒక అరుదైన ఫీట్ సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చహల్ నిలిచాడు. ఈ సీజన్లో చహల్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 23 వికెట్ల తీశాడు. ఈ సీజన్లో రాజస్తాన్ తరపున ఇదే అత్యుత్తమం.
ఇక తొలి స్థానంలో జేమ్స్ ఫాల్కనర్ ఉన్నాడు. 2013లో ఫాల్కనర్ 28 వికెట్లతో దుమ్మురేపాడు. లీగ్‌లో రాజస్తాన్‌కు మరో రెండు మ్యాచ్‌లు మిగిలిఉండడం.. ఆ తర్వాత ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉండడంతో చహల్ ఫాల్కనర్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇక సోహైల్ తన్వీర్(22 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. 2020 సీజన్లో జోఫ్రా ఆర్చర్(20 వికెట్లు), 2019లో శ్రేయాస్ గోపాల్(20 వికెట్లు) సంయుక్తంగా నాలుగోస్థానంలో ఉన్నారు.
చదవండి: IPL 2022: వార్నర్ అదృష్టం.. రాజస్తాన్ కొంపముంచింది