Yuzvendra Chahal: రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున యజ్వేంద్ర చహల్‌ కొత్త చరిత్ర

12 May, 2022 08:28 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉ‍న్నాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో​రాజస్తాన్‌ ఓడినప్పటికి చహల్‌ మాత్రం ఒక అరుదైన ఫీట్‌ సాధించాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చహల్‌ నిలిచాడు. ఈ సీజన్‌లో చహల్‌ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 23 వికెట్ల తీశాడు. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ తరపున ఇదే అత్యుత్తమం.

ఇక తొలి స్థానంలో జేమ్స్‌ ఫాల్కనర్‌ ఉన్నాడు. 2013లో ఫాల్కనర్‌ 28 వికెట్లతో దుమ్మురేపాడు.  లీగ్‌లో రాజస్తాన్‌కు మరో రెండు మ్యాచ్‌లు మిగిలిఉండడం.. ఆ తర్వాత ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఉండడంతో చహల్‌ ఫాల్కనర్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇక సోహైల్‌ తన్వీర్‌(22 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. 2020 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్‌(20 వికెట్లు), 2019లో శ్రేయాస్‌ గోపాల్‌(20 వికెట్లు) సంయుక్తంగా నాలుగో​స్థానంలో ఉన్నారు. 

చదవండి: IPL 2022: వార్నర్‌ అదృష్టం.. రాజస్తాన్‌ కొంపముంచింది

>
Poll
Loading...
మరిన్ని వార్తలు