IPL 2024 SRH VS MI: ఐపీఎల్‌లో టాప్‌-2 స్కోర్లు.. కామన్‌గా ఒకే ఆటగాడు..!

28 Mar, 2024 14:01 IST|Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌.. లీగ్‌ చరిత్రలోనే అత్యధిక టీమ్‌ స్కోర్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ ఈ రికార్డును నెలకొల్పే క్రమంలో ఆర్సీబీ పేరిట ఉండిన పాత రికార్డును బద్దలు కొట్టింది. 11 ఏళ్ల కిందట 2013 సీజన్‌లో ఆర్సీబీ.. పూణే వారియర్స్‌పై చేసిన 263 పరుగులే నిన్నటి మ్యాచ్‌కు ముందు వరకు ఐపీఎల్‌లో అత్యధిక టీమ్‌ స్కోర్‌గా ఉండింది.

ఐపీఎల్‌లో టాప్‌-2 స్కోర్‌లు నమోదైన సందర్భాల్లో ఓ ఆటగాడు కామన్‌గా ఉండటం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుత సన్‌రైజర్స్‌ ఆటగాడు జయదేవ్‌ ఉనద్కత్‌ 2013లో ఆర్సీబీతో.. ప్రస్తుతం సన్‌రైజర్స్‌లో ఉన్నాడు. ఈ విషయం గురించి తెలిసి నెటిజన్లు ఉనద్కత్‌ను లక్కీ లెగ్‌గా పరిగణిస్తున్నారు. భారీ స్కోర్లు నమోదు కావాలంటే ఉనద్కత్‌ ఉండాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. రెండు మ్యాచ్‌ల్లో ఉనద్కత్‌ ప్రత్యర్దులపై రెండేసి వికెట్లు పడగొట్టాడు. 

ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రవిస్‌ హెడ్‌ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్‌ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), క్లాసెన్‌  (34 బంతుల్లో 80 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), మార్క్రమ్‌ (28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 42 నాటౌట్‌) విధ్వంసం సృష్టించడంతో సన్‌రైజర్స్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆరెంజ్‌ ఆర్మీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు), నమన్‌ ధిర్‌ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సన్‌రైజర్స్‌కు దడ పుట్టించారు. 


 

Election 2024

మరిన్ని వార్తలు