బుమ్రా, సిరాజ్‌ కాదు.. అతడే టీమిండియా లీడింగ్‌ వికెట్‌ టేకర్‌: గంభీర్‌

10 Nov, 2023 16:53 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా పేస్‌ త్రయం జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ​తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరమైన వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి.. హార్దిక్‌ పాండ్యా గాయం కావడంతో జట్టులో చోటు దక్కింది. జట్టులోకి వచ్చిరాగానే షమీ తన విశ్వరూపం చూపించాడు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లతో షమీ చెలరేగాడు. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా తన అద్భుత ప్రదర్శనను షమీ కొనసాగించాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

అదే విధంగా బుమ్రా పవర్‌ప్లేలో జట్టుకు అద్భుతమైన ఆరంభాలను అందిస్తున్నాడు. బుమ్రా కూడా 15 వికెట్లు సాధించాడు. ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించకపోయిన మహ్మద్‌ సిరాజ్‌.. ఆ తర్వాత మాత్రం అద్భుతకమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు. శ్రీలంకపై మూడు వికెట్లతో సిరాజ్‌ అదరగొట్టాడు. 

ఇక మెగా టోర్నీలో చివరి లీగ్‌ మ్యాచ్‌లో నవంబర్‌ 12న బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో భారత తలపడనుంది. ఈ క్రమంలో భారత బౌలింగ్‌ విభాగాన్ని ఉద్దేశించి టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఈ టోర్నమెంట్‌లో జస్ప్రీత్ బుమ్రా కంటే షమీనే లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలుస్తాడని గంభీర్‌ జోస్యం చెప్పాడు.

"నా వరకు అయితే.. ఈ టోర్నీలో బుమ్రా కంటే షమీనే ఎక్కువ వికెట్లు సాధిస్తాడు. కానీ బుమ్రా అద్బుతమైన బౌలర్‌. పవర్‌ప్లేలో వికెట్లు పడగొట్టి జట్టుకు ఘనమైన ఆరంభాలను అందిస్తున్నాడు. ప్రత్యర్ధి బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి చాలా ఇబ్బంది పడతారు.

అయితే ఏ టోర్నమెంట్‌లోనైనా చాలా సార్లు అత్యుత్తమ బౌలర్‌కు ఎక్కువ వికెట్లు ఉండవు. బుమ్రాకు వికెట్లు లేకపోయినా మంచి ఎకానమీ రేటు మాత్రం ఉంది. బుమ్రా జట్టుకు కచ్చింతగా ఎక్స్‌ ఫ్యాక్టర్‌" అని స్పోర్ట్స్‌ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్‌ పేర్కొన్నాడు.
చదవండిAUS vs IND: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు!

మరిన్ని వార్తలు