LSG VS KKR: కేఎల్ రాహుల్ డైమండ్ డ‌క్‌.. సేమ్ సీన్ రిపీట్ కానుందా..?

7 May, 2022 20:07 IST|Sakshi

కేకేఆర్‌తో జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ డైమండ్ డ‌క్ (0 బంతుల్లో 0)గా వెనుదిరిగాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న డికాక్ చేసిన అన‌వ‌స‌ర త‌ప్పిదం కార‌ణంగా రాహుల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. సౌథీ వేసిన తొలి ఓవ‌ర్ ఐదో బంతిని క‌వ‌ర్స్ దిశ‌గా ఆడి సింగ‌ల్‌కు పిలిచిన డికాక్‌.. మూమెంట్ ఇచ్చి ఆగిపోవ‌డంతో అప్ప‌టికే క్రీజ్ వ‌దిలిన రాహుల్ తిరిగి క్రీజ్ చేరుకునే ప్ర‌య‌త్నంలో ర‌నౌట‌య్యాడు. శ్రేయ‌స్ అద్భుత‌మైన డైరెక్ట్ త్రోతో ల‌క్నో కెప్టెన్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. 

ఇదిలా ఉంటే, ప్ర‌స్తుత సీజ‌న్‌లో రాహుల్ డ‌కౌట్ కావ‌డం ఇది మూడోసారి. గుజ‌రాత్ టైటాన్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌ల్లో రాహుల్ ఖాతా తెర‌వ‌కుండానే ఔట‌య్యాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ తొలి బంతికే ఔట‌య్యాడు. రాహుల్ ఇలా ఔటైన గ‌త రెండు మ్యాచ్‌ల్లో ల‌క్నో ఓట‌మిపాల‌వ్వ‌డంతో ఈ మ్యాచ్‌లో కూడా త‌మ జ‌ట్టు ఓడుతుందేమోన‌ని ల‌క్నో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

కాగా, ల‌క్నో తొలి ఓవ‌ర్‌లోనే రాహుల్ వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికీ ఏమాత్రం త‌గ్గ‌కుండా కేకేఆర్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగింది. డికాక్ (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), దీప‌క్ హుడా (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్సర్) కేకేఆర్ బౌల‌ర్ల‌పై బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఫ‌లితంగా ఆ జ‌ట్టు స్కోర్ 6 ఓవ‌ర్ల త‌ర్వాత 66/1గా ఉంది. 
చ‌ద‌వండి: IPL 2022: బట్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. కోహ్లితో పాటుగా..

మరిన్ని వార్తలు