Magnus Carlsen: వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను వదులుకున్న కార్ల్‌సన్‌

20 Jul, 2022 20:41 IST|Sakshi

ప్రపంచ చెస్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ (31) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది (2023) తన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను డిఫెండ్ చేసుకోబోనని ప్రకటించాడు. గత దశాబ్ద కాలంగా చెస్‌ ప్రపంచాన్ని మకుటం లేని మారాజులా ఏలుతున్న కార్ల్‌సన్‌.. గతేడాది (2021) ఛాంపియన్‌షిప్‌ సాధించిన అనంతరమే ఈ విషయమై క్లూ ఇచ్చాడు. తాజాగా తాను టైటిల్‌ డిఫెండ్‌ చేసుకోవట్లేదని ఇవాళ స్పష్టం చేశాడు. 

చెస్‌ ఛాంపియన్‌ హోదాపై తనకు ఆసక్తి లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తన ఫ్రెండ్‌కు ఇచ్చిన పోడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కార్ల్‌సన్‌ గతేడాది ఇయాన్‌ నెపోమ్నియాచిపై ఐదో టైటిల్‌ నెగ్గి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, కార్ల్‌సన్‌ నిర్ణయంపై భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్ స్పందించాడు. కార్ల్‌సన్‌ నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. 1975లో బాబీ ఫిషర్ కూడా ఇలాగే ఆటను మధ్యలోనే వదిలేశాడని, ఇలా చేయడం వల్ల చదరంగం క్రీడకు నష్టం జరుగుతుందని అన్నాడు. 
చదవండి: బాంబుల మోత నుంచి తప్పించుకొని పతకం గెలిచి..

మరిన్ని వార్తలు