ప్రపంచ క్రికెట్‌లో రోహిత్ లాంటి ఆటగాడు మరొకరు లేరు: పాక్‌ లెజెండ్‌

13 Nov, 2023 20:11 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.  టోర్నీలో ఇప్పటికే 500కిపైగా పరుగులు చేసిన హిట్ మ్యాన్.. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ రోహిత్‌ మెరుపులు మెరిపించాడు. కేవలం 54 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

కాగా వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రమే కాకుండా సారథిగా కూడా జట్టును అద్బుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు రోహిత్‌ సారధ్యంలోని టీమిండియా.. లీగ్‌ స్టేజిలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

నవంబర్‌ 15న వాంఖడే వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తెల్చుకోవడానికి టీమిండియా సిద్దమవుతోంది. ఈ క్రమంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై పాకిస్తాన్‌ క్రికెట్‌ దిగ్గజం  వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత వరల్డ్‌ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ లాంటి ఆటగాడు మరొకరు లేరంటూ వసీం కొనియాడాడు.

" నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ కలిసి 10 ఓవర్లలో  91 పరుగులు జోడించారు. అప్పుడే డచ్‌పై భారత్‌ విజయం సాధించింది. రోహిత్‌ శర్మ ఒక అద్భుతం. ప్రస్తత ప్రపంచక్రికెట్‌లో అతడికి మించినవారు ఎవరూ లేరు. అందరూ విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, జో రూట్, బాబర్ ఆజం గురించి మాట్లాడతారు.

కానీ అందరికంటే రోహిత్ భిన్నమైన ఆటగాడు. ఎటువంటి పరిస్ధితులోనైనా ఒకే స్టైల్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. బౌలింగ్ అటాక్ ఎలాంటిదైనా సరే.. అతడు అలవోకగా షాట్లు కొడతాడని" ఏ స్పోర్ట్స్‌ ఛానల్‌ షోలో అక్రమ్‌ పేర్కొన్నాడు.
చదవండి: World cup 2023: కివీస్‌తో సెమీస్‌ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?


 

మరిన్ని వార్తలు