IPL 2022: 'నాకు రాజస్తాన్‌ ఒక కుటుంబం వంటిది.. వార్న్ సార్ ఆశీస్సులు నాకు ఉన్నాయి'

24 May, 2022 18:57 IST|Sakshi
PC: IPL.com

ఐపీఎల్‌-2022లో తొలి క్వాలిఫైయర్‌లో మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. అయితే ఈ కీలక పోరుకు ముందు రాజస్తాన్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌.. లెజెండరీ లెగ్-స్పిన్నర్, దివంగత షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో గుండెపోటుతో వార్న్ మరణించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌లో నాకు ఇది మొదటి సీజన్. కానీ నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆడుతున్నట్లు అనిపిస్తుంది.

"నాకు రాజస్తాన్‌ ఒక కుటుంబం వంటిది. నేను ఇక్కడ చాలా  రిలాక్స్‌గా ఉన్నాను. నాతో ఆడే జట్టు సభ్యులే కాకుండా మేనేజ్‌మెంట్‌ కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు. మరోవైపు వార్న్ సార్ రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ఆడాడు. అతను తొలి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా ఉన్నారు. ఆదే విధంగా అతని ఆశీస్సులు నాకు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అతను నన్ను పై నుంచి చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది" అని  రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో చాహల్ పేర్కొన్నాడు.

చదవండి: Nikhat Zareen: ఒలంపిక్ పతకం సాధిస్తా.. రెట్టింపు కృషి ఉంటేనే.. అందుకోసం!

మరిన్ని వార్తలు