IND vs NZ: న్యూజిలాండ్‌తో సెమీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌! శుబ్‌మన్‌ గిల్‌ రిటైర్డ్‌ హర్ట్‌

15 Nov, 2023 16:12 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌లో అద్బుతంగా ఆడుతున్న యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. గిల్‌కు తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా మైదాన్ని వీడాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ 23 ఓవర్‌లో గిల్‌ తీవ్రమైన తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు.

పరుగు తీయడానికి చాలా ఇబ్బంది పడిన గిల్‌.. ఒక్కసారిగా మైదానంలో కింద పడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో గిల్‌ మైదానాన్ని వీడాడు. ఫీల్డ్‌ను విడిచిపెట్టేటప్పటికీ గిల్‌.. 65 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగులు చేశాడు. గిల్‌ స్ధానంలో శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు.
చదవండి: IND vs NZ Semi Final: శెభాష్‌ హిట్‌మ్యాన్‌.. మెరుపులు మెరిపించిన రోహిత్‌! వీడియో వైరల్‌

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు