సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు

15 Nov, 2023 16:14 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 742 పాయింట్లు పెరిగి 65,675 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 231 పాయింట్లు ఎగబాకి 19,675 వద్ద స్థిర పడింది. టాటా మోటర్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, టాటా స్టీల్, టీసీఎస్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, హెచ్‌సీఎల్‌ టెక్, ఐటీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, అల్ట్రాటెక్ సిమ్ంట్, ఏషియన్ పేయింట్స్, మారుతి, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాల్లో ముగిశాయి.

యూఎస్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో అంచనాలకు అనుగుణంగా నమోదు కావడం అక్కడి మార్కెట్ల సెంటిమెంట్‌ను పెంచింది. ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు సానుకూలంగా కదలాడాయి. అక్టోబరులో టోకు ధరల ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) 0.52 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు దిగిరావడం ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌ నుంచి డబ్ల్యూపీఐ తక్కువగానే నమోదవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.1,244 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.830 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

మరిన్ని వార్తలు