Kohli Poor Form: కోహ్లిని పక్కనబెట్టనున్నారా?.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

29 Apr, 2022 18:37 IST|Sakshi
PC: IPL Twitter

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ విరాట్‌ కోహ్లి ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరపున ఆడుతున్న కోహ్లి ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి ఆటతీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ గంగూలీ కోహ్లి ఫామ్‌లోకి వస్తాడంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లితో పాటు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ  ఆటతీరుపై కూడా గంగూలీ స్పందించాడు.

'' కోహ్లి, రోహిత్‌లు ఇద్దరు గొప్ప ఆటగాళ్లు. వాళ్లిద్దరు కొత్తగా ప్రూవ్‌ చేసుకోవడానికి ఏం లేదు. కచ్చితంగా ఫామ్‌ అందుకొని పరుగులు సాధిస్తారు. ఇక కోహ్లి మైండ్‌లో ఏం ఆలోచనలు తిరుగుతున్నాయో చెప్పలేను కానీ అతను మాత్రం కచ్చితంగా ఫామ్‌ను అందుకుంటాడు. కోహ్లి ఒక మంచి ప్లేయర్‌.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టి20 ప్రపంచకప్‌కు చాలా సమయం ఉంది. కోహ్లి జట్టులో ఉంటాడా లేదా అనేది అవవసరమైన విషయం. రెస్ట్‌ పేరుతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. కోహ్లి ఒక్కడే కాదు.. రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ సహా మిగతా సీనియర్‌ ప్లేయర్లకు రెస్ట్‌ ఇవ్వాలనే యోచనలో ఉన్నాం. కోహ్లిని పూర్తిగా పక్కనబెట్టనున్నాం అనే వార్తల్లో వాస్తవం లేదు. ఒకవేళ అతను దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఆడాలనుకుంటే ఆడుతాడు. ఏదైనా అతన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం.

కరోనా భయంతో ఐపీఎల్‌లో బయోబబుల్‌ను ప్రవేశపెట్టాం. దేశంలో కరోనా కేసుల్లో పురోగతి లేదనిపిస్తే ఐపీఎల్‌లో బయోబబూల్‌ను తొలగించే అవకాశం ఉంది. కానీ ఏదైనా వేచి చూస్తే మంచిది. ఎందుకంటే కోవిడ్‌ మనతో పాటు మరో 10 సంవత్సరాలైనా ఉంటుంది. దానిని మనం అలవాటు చేసుకోవాలి. ఆటగాళ్ల శ్రేయస్సు కొరకే బయోబబూల్‌. కరోనా తగ్గిందంటే ఆటోమెటిక్‌గా బయోబబుల్‌ మాయమవుతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: కోహ్లికి విశ్రాంతి; ఒక్క సిరీస్‌కేనా.. పూర్తిగా పక్కనబెట్టనున్నారా?!

మరిన్ని వార్తలు