'రోహిత్, బాబ‌ర్‌ కాదు.. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ బ్యాట‌ర్‌ అత‌డే'

29 Mar, 2024 16:44 IST|Sakshi

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్  ఐపీఎల్‌-2024లో బీజీబీజీగా ఉన్నాడు. ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోని స్టీవ్ స్మిత్.. ప్ర‌స్తుతం అధికారిక బ్రాడ్‌కాస్ట‌ర్  స్టార్ స్పోర్ట్స్‌ కామేంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ క్ర‌మంలో గురువారం రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గోన్న స్టీవ్ స్మిత్‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది.

వ‌ర‌ల్డ్‌క్రికెట్‌లో అత్యుత్త‌మ బ్యాట‌ర్ ఎవ‌ర‌న్న ప్ర‌శ్న స్మిత్‌కు ఎదురైంది. వెంటనే స్మిత్ ఏమీ ఆలోచించ‌కుండా భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లినే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట‌ర్ అంటూ స‌మాధ‌న‌మిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. కాగా విరాట్ కోహ్లి వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో అత్యుత్త‌మ బ్యాట‌ర్ అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

కింగ్ కోహ్లి ఎన్నో అరుదైన ఘ‌న‌త‌ల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన స‌చిన్ టెండూల్క‌ర్ ఆల్‌టైమ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన ఘ‌న‌త విరాట్ ది. కింగ్ కోహ్లి ప్ర‌స్తుతం ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. ఆర్సీబీకి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న విరాట్‌.. పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 77 ప‌రుగుల‌తో అద‌ర‌గొట్టాడు. ఆర్సీబీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. మార్చి 29న కేకేఆర్‌తో మ్యాచ్‌కు కోహ్లి సిద్ద‌మ‌వుతున్నాడు.
 

Election 2024

మరిన్ని వార్తలు