క్రికెట్‌కు తిషారీ పెరీరా గుడ్‌ బై

3 May, 2021 16:23 IST|Sakshi
తిషారా పెరీరా(ఫైల్‌ఫోటో)

కొలంబో: శ్రీలంక క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ తిషారా పెరీరా తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. తన నిర్ణయం ఈరోజు నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్‌(ఎస్‌ఎల్‌సీ)కి లేఖ ద్వారా పెరీరా తెలియజేశాడు. తన వీడ్కోలుకు ఇదే తగిన సమయమని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. శ్రీలంక తరఫున ఆరు టెస్టులు మాత్రమే ఆడిన పెరీరా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం 166 వన్డేలు, 84 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.

ఐపీఎల్‌లో 37 మ్యాచ్‌లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో 2,338 పరుగులు చేసిన పెరీరా.. టీ20ల్లో 1204 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 175 వికెట్లు సాధించిన పెరీరా.. అంతర్జాతీ టీ20ల్లో 51 వికెట్లు తీశాడు. ‘ నేను శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్పగా భావిస్తున్నాను. ఓవరాల్‌గా ఏడు క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో శ్రీలంక  తరఫున ఆడాను. 2014లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన శ్రీలంక  జట్టులో సభ్యుడిగా ఉన్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఘనత’ అని ఎస్‌ఎల్‌సీకి రాసిన లేఖల పేర్కొన్నాడు. తిషారా పెరీరా వీడ్కోలుపై ఎస్‌ఎల్‌సీ సీఈవో అష్లే డిసిల్వా మాట్లాడుతూ.. ‘ అతనొక గొప్ప ఆల్‌రౌండర్‌. శ్రీలంక క్రికెట్‌ సాధించిన పలు ఘనతల్లో పెరీరా భాగస్వామ్యం ఉంది. లంక క్రికెట్‌కు పెరీరా ఎంతో చేశాడు’ అని పేర్కొన్నారు. 

ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ రద్దు తప్పదా?
 ఇద్దరు ప్లేయర్లకు కరోనా, నేటి మ్యాచ్‌ వాయిదా!

మరిన్ని వార్తలు