IPL 2022 RCB Vs CSK: సీఎస్‌కేను ఢీ కొట్టనున్న ఆర్‌సీబీ.. టాస్‌ గెలిస్తే!

4 May, 2022 13:53 IST|Sakshi

IPL 2022 CSK Vs RCB: ఐపీఎల్‌-2022లో మరో ఉత్కంఠభరిత పోరకు రంగం సిద్దమైంది. పుణేలోని ఎంసీఏ క్రికెట్‌ స్టేడియం వేదికగా బుధవారం(మే 4) చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక వరుస మూడు ఓటములతో డీలా పడ్డ ఆర్‌సీబీ.. సీఎస్‌కేపై విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. విరాట్‌ కోహ్లి తిరిగి ఆర్‌సీబీ కలిసిచ్చే ఆంశం. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ డుప్లెసిస్‌,  మాక్స్‌వెల్‌, కార్తీక్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు బ్యాట్‌ ఝుళిపిస్తే.. సీఎస్‌కే గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు. ఇక బౌలిం‍గ్‌ పరంగా ఆర్‌సీబీ పటిష్టంగా కన్పిస్తోంది. బౌలిం‍గ్‌ విభాగంలో జోష్‌ హాజిల్‌వుడ్‌, సిరాజ్‌, హాసరంగా వంటి స్టార్‌ బౌలర్లు ఉన్నారు. 

ఇక సీఎస్‌కే విషయానికి వస్తే.. ధోని తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు  చేపట్టాక తొలి మ్యాచ్‌లోనే సీఎస్‌కే విజయం సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిపొందింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా సీఎస్‌కే పటిష్టంగా కన్పిస్తోంది.  ఇక ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్లు  రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, కాన్వే అధ్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు.

అదే విధంగా మిడిలార్డర్‌లో రాయుడు కూడా రాణిస్తోన్నాడు. ఇక గత మ్యాచ్‌కు దూరమైన బ్రావో ఈ మ్యాచ్‌కు అందుబాటులోఉండే అవకాశం ఉంది. ఇక ఇరు జట్లలో హిట్టర్లు ఉన్నారు కాబట్టి భారీ స్కోర్‌లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు 30 సార్లు ముఖాముఖి తలపడగా.. సీఎస్‌కే 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఆర్‌సీబీ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది.
 

పిచ్‌ రిపోర్ట్‌
ఎంసీఏ స్టేడియం పిచ్‌ గత మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు, బౌలర్లకు అనుకూలించింది. గత మ్యాచ్‌ల్లో భారీ స్కోర్‌లు  నమోదయ్యాయి. అయితే న్యూ బాల్‌తో బౌలర్లు కూడా వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

తుది జట్లు అంచనా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్‌),  డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ

చదవండి: IPL 2022 Playoff Venues: ఐపీఎల్ అభిమానులకు గుడ్​న్యూస్ చెప్పిన బీసీసీఐ..!

Poll
Loading...
మరిన్ని వార్తలు