ఒలింపిక్స్‌ బెర్త్‌ లక్ష్యంగా.. నేడు పటిష్టమైన జర్మనీతో భారత్‌ 'ఢీ' 

18 Jan, 2024 09:55 IST|Sakshi

Women's Hockey Olympic Qualifiers: మరో మ్యాచ్‌ కోసం ఎదురు చూడకుండా... పటిష్టమైన జర్మనీపై గెలిచి పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత మహిళల హాకీ జట్టు ఉంది. రాంచీలో జరుగుతున్న ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా ఈరోజు జర్మనీతో భారత్‌; అమెరికాతో జపాన్‌ తలపడనున్నాయి.

సెమీఫైనల్లో గెలిచి ఫైనల్‌ చేరిన రెండు జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో ఓడిన జట్ల మధ్య మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టుకు మాత్రమే చివరిదైన మూడో బెర్త్‌ ఖరారవుతుంది. దాంతో భారత్‌తోపాటు మిగతా మూడు జట్లు కూడా సెమీఫైనల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నాయి.

2006 నుంచి జర్మనీతో ఏడుసార్లు తలపడ్డ భారత్‌ ఐదుసార్లు ఓడిపోయి, కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో జర్మనీపై గెలవాలంటే భారత్‌ సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్‌ 18లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  

>
మరిన్ని వార్తలు