వృద్ధిమాన్ సాహా ఓపెనర్‌గా పనికిరాడు: దక్షిణాఫ్రికా కోచ్‌

25 Sep, 2021 16:26 IST|Sakshi

Mark Butcher Comments On Wriddhiman Saha:  ఐపీఎల్‌ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచింది. దీంతో ఫ్లేఆఫ్‌ అవకాశాలు దాదాపు ముగిసాయి. అయితే ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేజ్‌కు ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో  దూరమయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌తో కలిసి వృద్ధిమాన్ సాహా హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అయితే వృద్ధిమాన్ సాహా ఇన్నింగ్స్‌ను ఆరంభించడంపై దక్షిణాఆఫ్రికా కోచ్‌ మార్క్‌ బౌచర్‌   ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన సాహా వరుసగా 7,1,18, పరుగుల మాత్రమే సాధించాడు.

"వృద్ధిమాన్ సాహా వాస్తవానికి మంచి వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్సమన్‌. అయితే సాహా ఓపెనింగ్‌లో ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. తన బ్యాటింగ్‌ ఆర్ఢర్‌లో మార్పు చేస్తే అతడు అధ్బుతంగా ఆడగలడు" అని ఓ క్రికెట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు. 

చదవండిGautam Gambhir: చెన్నై ప్లేఆఫ్స్‌ చేరాక ధోని ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి!

మరిన్ని వార్తలు