ఆ క్షణంలో చాలా భయపడిపోయా: సాహా

12 May, 2021 20:47 IST|Sakshi

ముంబై: కరోనా పాజిటివ్‌ అని తెలియగానే తాను చాలా భయపడిపోయానని ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పేర్కొన్నాడు.  ఈ సీజన్‌లో ఆరంభంలో సాహాని ప్రయోగాత్మక ఓపెనర్‌గా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడించింది. అయితే ఆడిన రెండు మ్యాచ్‌లు కలిపి 8 పరుగులు మాత్రమే చేయడంతో తర్వాత రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలోనే  సాహా కరోనా వైరస్ బారినపడ్డాడు. అప్పటికే కేకేఆర్‌ ఆటగాళ్లు కరోనా బారీన పడడం.. సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌లోనూ కరోనా కేసులు వెలుగు చూడడంతో బీసీసీఐ సీజన్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న సాహా తన ఆరోగ్యం గురించి అప్‌డేట్‌ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

‘‘కరోనా పాజిటివ్‌గా తేలగానే చాలా భయపడిపోయా. నేనే కాదు.. నా ఫ్యామిలీ మొత్తం ఆందోళనకి గురయ్యారు.  అది తెలిసి నేనే నా ఫ్యామిలీకి వీడియో కాల్‌ చేసి వారికి నా ఆరోగ్యం బాగానే ఉందని.. మీరు ఆందోళన చెందొద్దని చెప్పాను. కాగా ఐపీఎల్‌ సందర్భంగా  ప్రాక్టీస్ ముగించుకుని హోటల్‌కి వచ్చిన తర్వాత జలుబు, దగ్గు రావడంతో టీమ్‌ డాక్టర్‌కి సమాచారం అందించాను. ఆరోజే క్వారంటైన్‌లో ఉంచి.. నాకు కరోనా పరీక్ష చేశారు. వెంటనే నన్ను ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది'' అని చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్‌ టోర్నీ రద్దు అయ్యే సమయానికి 29 మ్యాచ్‌లు ముగిశాయి. మరో  31 మ్యాచ్‌లు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేసి సెప్టెంబరు- అక్టోబరులో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తుంది. అయితే  ఇంగ్లండ్ క్రికెటర్లతో పాటు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు మిగిలిన మ్యాచ్‌లు ఆడే అవకాశాలు లేవని ఆయా బోర్డులు స్పష్టం చేశాయి.
చదవండి: కరోనాతో మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ తండ్రి కన్నుమూత

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు