సమ్మేటివ్‌–1 పరీక్షలు ప్రారంభం

29 Nov, 2023 01:26 IST|Sakshi
బుక్కపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

పుట్టపర్తి: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సమ్మేటిట్‌ (ఎస్‌ఏ)–1 పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన ప్రశ్నాపత్రాలతోనే పరీక్ష నిర్వహించినట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 2,087 పాఠశాలలు పనిచేస్తుండగా, ఆయా పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకూ 2,44,174 మంది విద్యార్థులు చదువుతున్నారు. మంగళవారం జరిగిన పరీక్షకు 95 శాతం మంది హాజరైనట్లు డీఈఓ వెల్లడించారు. 1 నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12.30 వరకు, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకూ పరీక్ష నిర్వహించామన్నారు. డిసెంబర్‌ 8వ తేదీ వరకూ పరీక్షలు ఉంటాయని డీఈఓ వెల్లడించారు.

మరిన్ని వార్తలు