వైద్యుడి కుటుంబాన్ని వెంటాడిన కరోనా

25 Jul, 2020 12:09 IST|Sakshi
నాగేంద్రతల్లిదండ్రులు (ఫైల్‌)

పాజిటివ్‌తో ఒక రోజు వ్యవధిలో తల్లీతండ్రి మృతి

వారం క్రితం కరోనాతో బావ మృత్యువాత

కర్ణాటక,బొమ్మనహళ్లి : ప్రాణాంతక కరోనా బారిన పడినవారికి ఆయుష్షు పోస్తున్నవైద్యుడి కుటుంబంపై కరోనా పంజా విసిరింది. ఒక రోజు వ్యవధిలో అతని తల్లిని తండ్రిని బలి తీసుకుంది. సారక్కిలో నివాసం ఉంటున్న డాక్టర్‌ నాగేంద్ర బొమ్మనహవైద్యుడి కుటుంబంళ్లి బీబీఎంపీ విభాగంలో ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేస్తున్నారు. కరోనా బారిన పడిన నాగేంద్ర తల్లి గురువారం మృతి చెందగా తండ్రి శుక్రవారం ఉదయం మృతి చెందాడు.

ఇదిలా ఉండగా నాగేంద్ర బావ డాక్టర్‌  మంజునాథ్‌ చిక్కముదవాడి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా పనిచేసేవారు. మంజునాథ్‌కు పాజిటివ్‌ రావడంతో నాలుగు ఆస్పత్రులో చికిత్స చేయించుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. వారం రోజుల క్రితం ఆయన మృతి చెందా డు. కరోనా బారిన పడిన ఎంతోమందికి  వైద్య సేవలు అందించిన మంజునాథ్‌ చివరకు కరోనాకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు.  వారం రోజుల వ్యవధిలో వైద్యుడి కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడటంతో సారక్కి వార్డులో విషాదం చోటు చేసుకుంది. నాగేంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యే  సతీష్‌రెడ్డి పరామర్శించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు