భూమాత రోజు నాకు సర్‌ప్రైజ్‌ ఇస్తుంది..

25 Jul, 2020 12:05 IST|Sakshi

ఉదయం నిద్ర లేచేటప్పుడే చిరునవ్వుతో లేస్తే ఆ రోజంతా సంతోషంగా ఉంటామని డాక్టర్లు చెబుతుంటారు. చాలా మంది అలాగే చేయాలి అనుకుంటారు. కొంతమంది చేస్తారు. నవ్వుతూ నిద్ర లేవాలంటే కూడా ఇంట్లో అందుకు తగ్గ పరిస్థితులు ఉండాల్సిందే. అయితే తన డాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన  హీరోయిన్ సాయి పల్లవి ఇంటి వద్ద అలాంటి పరిస్థితులే ఉంటాయట. ఉదయాన్నే లేచేసరికి ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందట. ఈ విషయాన్ని సాయిపల్లవి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. 

చదవండి: ‘మరో బిడ్డను కనే అర్హత లేదు’‘మరో బిడ్డను కనే అర్హత లేదు’

The reason I woke up with a smile...was coz mama earth threw in a surprise 🌸 #rainbow #6am #hatti

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

‌ఉదయాన్నే తనను భూమాత సర్‌ప్రైజ్‌ చేస్తుందని సాయిపల్లవి తెలిపింది. అందుకే తాను ప్రతిరోజు చిరునవ్వుతో నిద్రలేస్తానని చెప్పింది. తన ఇంటి బయట నుంచి ఆకాశంలోకి చూస్తే అద్భుతంగా కనబడుతుందని, దీనిని తెలిపే వీడియోను ఆమె పోస్ట్ చేసింది. పెద్ద ఇంద్రధనుస్సు  ఒకటి ఇందులో కనబడుతుంది. ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం కారణంగా తాను ప్రతి రోజు సంతోషంగా గడుపుతానని సాయిపల్లవి చెబుతోంది.  ఆమె పోస్ట్ చేసిన వీడియో అభిమానులు లైక్‌లు కొడుతున్నారు. 

చదవండి: పెళ్లిపై సాయి పల్లవి షాకింగ్‌ కామెంట్స్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు