మార్చిలోనే మండుతున్న ఎండలు.. రికార్డవుతున్న అధిక ఉష్ణోగ్రతలు

13 Mar, 2024 11:49 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: మార్చినెల సగం గడవక ముందే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.గత ఏడాదితో పోల్చితే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ప్రస్తుతం రోజువారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. రెండుమూడు రోజులుగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. 

ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో మంగళవారం 40.5 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ లో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటివరకు.. రాష్ట్రంలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 40.3 డిగ్రీల  సంగారెడ్డి జిల్లాలో 39.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ఇదీ చదవండి.. ఇక టీఎస్‌ బదులు టీజీ

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers