పేద విద్యార్థికి ఎన్నారై చేయూత.. ఐఐటీలో సీటు

3 Dec, 2022 14:38 IST|Sakshi
తల్లిదండ్రులతో చంద్రకాంత్‌

ఐఐటీ జోద్‌పూర్‌లో ఫీజు చెల్లించి సాయం 

ఇచ్చోడ(ఆదిలాబాద్ జిల్లా): పేద విద్యార్థికి చేయూతనిచ్చి ఓ ఎన్నారై ఉదారత చాటుకున్నాడు. నేరడిగొండ మండలం బోందిడి గ్రామానికి చెందిన అడె సుదర్శన్‌–విజయ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరి కుమారుడు చంద్రకాంత్‌ ఒకటి నుంచి ఇంటర్‌ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లోనూ సత్తాచాటాడు. ఎస్టీ కేటగిరీలో ఆలిండియా 787 ర్యాంక్‌ సాధించాడు. 

ఐఐటీ జోధ్‌పూర్‌లో సీటు లభించింది. సరస్వతీ కరుణ ఉన్నా లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చంద్రకాంత్‌ ఐఐటీలో ప్రవేశరుసుం కట్టే ఆర్థిక స్తోమత లేక ఇంటివద్దనే ఉండి పోయాడు. విషయం తెలుసుకున్న ఇచ్చోడకు చెందిన ఓ ప్రైవేట్‌ పాఠశాల కరస్పాండెంట్‌ మౌనిక రాథోడ్‌ ఇటీవల ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. 

మంత్రి సన్నిహితుడి ద్వారా విషయం తెలుసుకున్న యూఎస్‌లో స్థిరపడ్డ ఎన్నారై శశికాంత్‌ స్పందించాడు. కనపర్తి ఐఐటీ జోధ్‌పూర్‌లో ప్రవేశరుసుం కట్టి చంద్రకాంత్‌ను చేర్పించాడు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు, సాయం అందించిన ఎన్నారై శశికాంత్‌కు, అలాగే మౌనిక రాథోడ్‌కు చంద్రకాంత్‌ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు?)

మరిన్ని వార్తలు