‘వైఎస్సార్‌ను మైనార్టీ ప్రజలు తమ జీవితంలో మరచిపోరు’

4 Oct, 2021 17:48 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సోమవారం మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గురించి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ లాంటి నేతను తన జీవితంలో చూడలేదని అన్నారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ప్రజల పక్షపాతి, ముస్లింల శ్రేయోభిలాషిగా అభివర్ణించారు. వైఎస్సార్‌ను మైనార్టీ ప్రజలు తమ జీవితంలో మరచిపోరని అన్నారు.

సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే తక్షణం పరిష్కరించిన గొప్ప మనసున్న నాయకుడిగా..  దివంగత నేత చేసిన సేవలను అక్బరుద్దీన్‌ గుర్తుచేసుకున్నారు.  గతంలో.. కబ్జాలకు గురైన 85 ఎకరాల బాబా షర్ఫోద్దిన్‌ దర్గా స్థలాలను .. ఒక జీవోతో తిరిగి వక్ఫ్‌బోర్డుకు వైఎస్సార్‌ అప్పగించారని అక్బరుద్దీన్‌ అన్నారు. 

చదవండి: రాష్ట్రంలో ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్‌ ఉండాలి: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు