అభివృద్ధి, సుస్థిర పాలనకే మా మద్దతు

6 Nov, 2023 03:04 IST|Sakshi
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న గ్రేటర్‌ రాయలసీమ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ప్రతినిధులు

సీమాంధ్రుల పేరుతో తెలంగాణలో కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు 

15 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని పలు పార్టీలను బెదిరిస్తున్నారు 

అలాంటి వారితో మాకు సంబంధం లేదు 

గ్రేటర్‌ రాయలసీమ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ స్పష్టికరణ

సాక్షి, హైదరాబాద్‌/పంజగుట్ట: సీమాంధ్రులమని చెప్పుకుంటూ కొందరు తెలంగాణలో కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని గ్రేటర్‌ రాయలసీమ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆరోపించింది. తెలంగాణలో స్థిరపడిన సుమారు 15 లక్షల మంది సీమాంధ్రులు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలరంటూ తమ పేరుతో కొందరు స్వార్థ రాజకీయాల కోసం వివిధ పార్టీలను 15 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని దుయ్యబట్టింది.

అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్‌ రాయలసీమ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. హనుమంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, సుస్థిర పాలనకే తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి తాము పూర్తి వ్యతిరేకమని తేలి్చచెప్పారు. సెటిలర్స్‌ అనే పదమే లేదని.. తామంతా తెలంగాణావాసులమేనన్నారు. 

విద్య, వైద్యం, ఉపాధి కోసమే తెలంగాణకు.. 
గ్రేటర్‌ రాయలసీమ ప్రాంతం (నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం) నుంచి తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది స్థిరపడ్డారని హనుమంతరెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చ ల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, ఉప్పల్, అంబర్‌పేట్, ముషీరాబాద్, సనత్‌నగర్, నాంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, ఉప్పల్‌ నియోజకవర్గాలతోపాటు మహ బూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్‌ జిల్లాల్లోనూ చాలా మంది వ్యాపారాలు, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన వివరించారు.

రాష్ట్రం విడిపోయాక అన్నదమ్ముల్లా కలసిమె లసి ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. ఇక్కడ ఎ లాంటి ఇబ్బందులు లేవన్నారు. దేశంలోనే అ త్యంత వెనుకబడిన, కరువుపీడిన ప్రాంతమైన రా యలసీమ నుంచి విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజలు హైదరాబాద్‌ సహా తెలంగాణకు వస్తుంటారన్నారు. 

మాకూ ఓ భవన్‌ కట్టివ్వాలి... 
గ్రేటర్‌ రాయలసీమ అసోసియేషన్‌ అఫ్‌ తెలంగాణ సంస్థ స్థాపించి పదేళ్లు అయ్యిందని... ఇందులో 40 వేల మంది సభ్యులు ఉన్నారని హనుమంతరెడ్డి చెప్పారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు వీలుగా ఇతర ప్రాంతవాసులకు కేటాయించినట్లుగా తమ అసోసియేషన్‌కు సైతం ఒక భవనం తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధా న కార్యదర్శి రాఘవ్, బద్రీనాథ్, నిరంజన్‌ దేశాయ్, చంద్రశేఖర్‌రెడ్డి, కులేశ్వర్‌రెడ్డి, రాజే‹Ù, రాజశేఖర్‌రెడ్డి, రామకృరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు