ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా?

23 Nov, 2023 11:53 IST|Sakshi

తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్‌ తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు. బుధవారం తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లిన ముఖ్యమంత్రికి చైర్‌పర్సన్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సారి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని గెలిపిస్తారా అని చైర్‌పర్సన్‌ను అడగగా.. ఖచ్చితంగా గెలిపిస్తాం సార్‌ అని ఆమె సమాధానం ఇచ్చారు.

కాగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి, చైర్‌పర్సన్‌ స్వప్నకు మధ్య గొడవ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాటన్నింటిని పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ చైర్‌పర్సన్‌ను సముదాయించారు. దీంతో ఎమ్మెల్యే గెలుపే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం సైతం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు