సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

9 May, 2021 21:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌-19పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కాగా సమీక్షా సమావేశానంతరం సీఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌ కాల్‌లో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ చేసిన సూచనలను కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ తనకు వివరించారని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం..మీ సూచనలకు అభినందనలు’ ’ అంటూ ప్రధాని సీఎం కేసీఆర్ ను అభినందించారు. 

రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి  విజ్జప్తి చేశారు. సీఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని  సీఎం కు హామీ ఇచ్చారు.

చదవండి: కోవిడ్‌-19పై ముగిసిన కేసీఆర్‌ సమీక్షా సమావేశం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు