స్పీడ్‌ పెంచిన సీఎం రేవంత్‌.. ఇక GHMC, HMDA వంతు..

19 Dec, 2023 16:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే పలు శాఖలపై సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ఇక, తాజాగా కొత్త ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌పై ఫోకస్‌ పెట్టింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏపై సమీక్ష చేపట్టనుంది. 

అయితే, గ్రేటర్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 25వ తేదీ తరువాత జీహెచ్‌ఎంసీ-హెచ్‌ఎండీఏపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ-హెచ్‌ఎండీఏ పరిధిలో రిపోర్టు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్‌, పెండింగ్‌ పనుల లిస్ట్‌పై బల్దియా కసరత్తు మొదలు పెట్టింది. 

ఇక, హెచ్‌ఎండీఏ పరిధిలో ఓఆర్‌ఆర్‌ టెండర్లు, భూముల వేలంతో పాటు పెండింగ్‌ పనుల లిస్ట్‌ను అధికారులు సిద్దం చేస్తున్నారు. మరోవైపు, ఆదాయ మార్గాల్లో భాగంగా రెండింటిపై ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్‌ రెడ్డి వద్దే మున్సిపల్‌ శాఖ ఉన్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు