Gandhi Hospital: గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్‌

11 Jan, 2022 16:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్: తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ పౌరులతోపాటు కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో 44 మందికి, ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌గా తేలింది.

గాంధీలో  20 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు బోధన సిబ్బంది, 10 మంది హౌజ్‌ సర్జన్స్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. అదే విధంగా ఉస్మానియాలో 25మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ స్టూడెంట్స్,  ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా తెలంగాణలో సోమవారం 1,825 కోవిడ్‌ కేసులు నమోదయయాయి. ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,95,855, మరణాల సంఖ్య 4,043కి చేరింది. ప్రస్తుతం 14, 995 యాక్టివ్‌ కేసులున్నాయి.
చదవండి: కరీంనగర్‌లో దంచికొట్టిన వాన..కుప్పకూలిన 70 అడుగుల లైటింగ్‌ కటౌట్‌
చదవండి:
 సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ

మరిన్ని వార్తలు