కరోనా: ఉచితంగా ఆహారం అందిస్తాం.. అంత్యక్రియలు చేస్తాం..

4 May, 2021 09:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం): కరోనా బారిన పడిన నిరుపేదలకు ఆహారం అందించటం కోసం సత్తుపల్లి ఫుడ్‌ బ్యాంక్‌ సిద్ధంగా ఉందని నిర్వాహకులు పఠాన్‌ ఆషాఖాన్‌ సోమవారం విలేకరులకు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మానవత్వంతో స్పందించటం అందరి బాధ్యతన్నారు.

కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైరస్‌ బారినపడిన వారికోసం ఫుడ్‌ బ్యాంక్‌ ఫోన్‌ నంబర్‌ 98495 99802ను సంప్రదించాలని, వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. నేరుగా బాధితుల ఇంటి వద్దకే వచ్చి ఆహారం అందజేస్తామన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు