తడిసిముద్దయిన తెలంగాణ.. ఫొటోలు, వీడియోలు

7 Sep, 2021 13:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు సోమవారం మరింత దంచికొట్టాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల్లో అధిక వర్షాపాతం నమోదైంది.
(చదవండి: Doctor Missing Case: వీడని మిస్టరీ.. డాక్టర్‌ జయశీల్‌రెడ్డి ఏమయ్యారు?)

సోమవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భారీగా వానలు పడటంతో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో 17.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాల్వంచలో 16.4, చుంచుపల్లిలో 16.1, లక్ష్మీదేవిపల్లిలో 14.8, దమ్మపేటలో 12.6, టేకులపల్లిలో 11.4, అన్నపురెడ్డిపల్లిలో 10.8, ముల్కలపల్లిలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా సంగెంలో 14.8 సెం.మీ, నడికుడలో 14.5, బయ్యారంలో 12.3, చింతగట్టులో 10.8, ఎల్కతుర్తిలో 10, ధర్మసాగర్‌లో 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. 
(చదవండి: Jobs In Telangana: తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా..)

భారీ వర్షాలకు లోయర్‌ మానేర్‌ గేట్లన్నీ ఎత్తారు..

సిరిసిల్లల్లో రోడ్లన్నీ జలమైన దృశ్యాలు..

భారీ వర్షానికి కరీనంగర్‌ పరిస్థితి

మరిన్ని వార్తలు