కొనసాగుతున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌మార్కెట్‌ దందా

22 May, 2021 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా బాధితులకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్ష బ్లాక్‌మార్కెట్‌ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా రెమ్‌డెసివర్‌ను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న వ్యక్తిని శనివారం టాస్క్‌ఫోర్స్‌ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తి ఉప్పల్‌ నర్సింగ్‌హోమ్‌లో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెమ్‌డెసివర్‌కు మార్కెట్లో కొరత ఉండడంతో బ్లాక్‌లో అమ్ముకుంటే డబ్బులు బాగా సంపాదించొచ్చని అనిల్‌ భావించాడు. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.25 వేలకు కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. అయితే  సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ అనిల్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నాలుగు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు