జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌ బాధ్యతలు

19 Mar, 2024 10:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం జరగాల్సి ఉంది. అయితే ఈలోపు జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు.

తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ ఆయనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్‌ గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల సారాంశం.

తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌..  ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్‌.  1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీ బలపడేందుకు ఎన్నో పోరాటాలు చేశారాయన. అలాగే.. బీజేపీ తరఫున ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు.  కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన జార్ఖండ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు.

Election 2024

మరిన్ని వార్తలు