కరెన్సీ నోట్లపై గాంధీ బదులు మోదీ బొమ్మ ముద్రిస్తారేమో: కేటీఆర్‌ సెటైర్లు

16 Sep, 2022 13:22 IST|Sakshi

తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య పచ్చగడి వేసినా భగ్గమనే పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీపై రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. అటు కేటీఆర్‌ సైతం సందర్భానుసారం సోషల్‌ మీడియాలో బీజేపీపై విరుచుకుపడుతున్నారు. 

తాజాగా కేటీఆర్‌.. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అహ్మదాబాద్‌ ఎల్జీ మెడికల్‌ కళాశాలకు ప్రధాని మోదీ పేరు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ.. సర్దార్‌ పటేల్‌ స్టేడియానికి ఇప్పటీకే మోదీ పేరు పెట్టారు. ఇప్పుడు అహ్మదాబాద్‌ ఎల్జీ మెడికల్‌ కళాశాలకూ ఆయన పేరే పెట్టారని గుర్తు చేశారు.

ఒకవేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కనుక చాన్స్‌ ఉంటే.. త్వరలో ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లపైనా గాంధీ బొమ్మ బదులు మోదీ బొమ్మ ముద్రించమని ఆదేశించవచ్చు అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు