కేఎఫ్‌సీ చికెన్‌ తింటున్నారా.. అయితే జాగ్రత్త!

9 Aug, 2021 14:07 IST|Sakshi

కేఎఫ్‌సీ చికెన్‌ తెలియని వారు ఎవరూ ఉండరు. చిన్న నుంచి పెద్దవారి వరకు లొట్టలేసుకుంటూ తినేవారు చాలామంది ఉంటారు. లాక్‌డౌన్‌ అనంతరం కేఎఫ్‌సీ సెంటర్లు తిరిగి తెరుచుకోవడంతో భోజన ప్రియులు మళ్లీ క్యూ కడుతున్నారు. అయితే తాజాగా ఓ కస్టమర్‌కు కేఎఫ్‌సీ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలో అనుకుంటే పొరబడ్డట్లే. హైదరాబాద్‌ నగరంలోనే చోటుచేసుకున్న ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

చికెన్‌ తినేందుకు సాయితేజ అనే వ్యక్తి కూకట్‌పల్లిలోని కేఎఫ్‌సీ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ చికెన్‌ ఆర్డర్‌ ఇవ్వగా.. కేఎఫ్‌సీ సిబ్బంది సరిగా ఉడకని చికెన్‌ పీస్‌లను సర్వ్‌ చేశారు. అది చూసిన కస్టమర్‌ షాక్‌ అయ్యి ఇలా ఉందేంటీ అని సిబ్బందికి ఫిర్యాదు చేయగా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని అతను ట్విట్టర్‌ వేదికగా పోస్టు చేశాడు. హైదరాబాద్‌లోని జెఎన్‌టీయూ మెట్రో కేఎఫ్‌సీ స్టోర్‌ నుంచి నుంచి తీసుకున్న చికెన్‌లో నాణ్యత లేదని.. పీస్ అస్సలు ఉడకలేదంటూ సాయి తేజ వాపోయాడు.

ఇలాంటి ఆహారాన్ని తింటే కస్టమర్లకు కడుపు నొప్పి సమస్యలు వస్తాయని, ఈ పరిశీలించాలంటూ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ను ట్యాగ్‌ చేశాడు. దీనిపై జీహెచ్‌ఎంసీ జోనల్ కమీషనర్ స్పందించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు