telangana: శాసనసభకు అయిదు కంటే ఎక్కువసార్లు ఎన్నికైంది వీరే..

28 Oct, 2023 19:58 IST|Sakshi

తెలంగాణ నుంచి శాసనసభకు ఐదు లేదా అంతకన్నా ఎక్కువగా ఎన్నికైనవారి సంఖ్య నలబై అయిదు  వరకు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికి ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత ఏడుసార్లు శాసనసభకు ఎన్నికైన వారు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి , ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ ఈ ఘనత పొందారు.

జానారెడ్డి 1983,1985 లలో టీడీపీ పక్షాన, 1989,1999,2004,2009,2014లలో కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. ఈటెల రాజేందర్ 2004 ,2008  ఉప ఎన్నిక, 2009, 2010 ఉప ఎన్నిక, 2014,2 018లలో టిఆర్ఎస్ పక్షాన, 2021 ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఆయన గెలుపొందారు. ఆరుసార్లు గెలిచినవారిలో జి.గడ్డెన్న, టీ.జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సీ రాజేశ్వరరావు, తన్నీరు హరీష్ రావు, డాక్టర్ ఎమ్.చెన్నారెడ్డి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, నర్రా రాఘవరెడ్డి ఉన్నారు.

ఇక ఐదుసార్లు గెలిచిన నేతలలో   జి.రాజారాం, గంపా గోవర్దన్, మండవ వెంకటేశ్వరరావు, కరణం రామచంద్రరావు, సి.విఠల్ రెడ్డి, కె.హరీశ్వర్ రెడ్డి, పి.జనార్ధనరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్, అక్బరుద్దీన్ ఒవైసి, సలావుద్దీన్ ఒవైసి, అమానుల్లాఖాన్, జి.సాయన్న, డాక్టర్ పి.శంకరరావు, గురునాధరెడ్డి, జె.కృష్ణారావు, ఎన్.ఉత్తం కుమార్ రెడ్డి, పి.గోవర్దనరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు

మరిన్ని వార్తలు