దాతృత్వం చాటుకున్న మంత్రి.. బ్లాక్‌ ఫంగస్‌ బాధితుడికి అండ

2 Jun, 2021 08:19 IST|Sakshi

ట్విట్టర్లో పెట్టిన విన్నపానికి స్పందించిన మంత్రి

యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి): యైటింక్లయిన్‌కాలనీకి చెందిన అహ్మద్‌ మోహినుద్దీన్‌ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం గతనెల 27 హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బ్లాక్‌ ఫంగస్‌ వచ్చినట్లు తెలపడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సూచన మేరకు కేటీఆర్‌ను ట్విట్టర్లో వేడుకున్నారు.

కేటీఆర్‌ వెంటనే స్పందించి తన కార్యాలయ సిబ్బందిని పంపించి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాటు చేశారు. బ్లాక్‌ ఫంగస్‌ వైరస్‌ తగ్గడానికి సంబంధించిన ఇంజక్షన్‌ సైతం ఏర్పాటు చేసి అహ్మద్‌ కుటుంబానికి అండగా నిలిచినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.   

చదవండి: కరోనా సోకిన భార్య.. భర్త చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు