Bhuvanagiri: ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్య.. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి

6 Feb, 2024 17:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యపై ఆలస్యంగానైనా.. తమ డిమాండ్‌కు స్పందించి దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్‌’ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

‘భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఎమ్మెల్సీ  పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్‌ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం సాయంత్రం ఆ ఇద్దరు విద్యార్థినిలు వారు ఉండే హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega